Chandrayaan-3: గతేడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి ‘‘శివశక్తి’’ పాయింట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అయితే, ఈ పేరుకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(IAU) ఆమోదం తెలిపింది. దీంతో 7 నెలల తర్వాత అధికారికంగా విక్రమ్ దిగిన ప్రాంతానికి ‘‘శివశక్తి’’ పాయింట్‌గా నామకరణం చేసినట్లు అయింది.
Read Also: Pakistan: భారత్‌తో వాణిజ్య సంబంధాల కోసం పాకిస్తాన్ ఆరాటం..
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ కోసం ‘‘ స్టేషియో శివశక్తి’’ అనే పేరును మార్చి 19న ప్యారిస్‌లోని ఐఏయూ ఆమోదించింది. ఇది అంతరిక్ష ప్రాంతాలకు పేర్లను పెట్టే ఒక సంస్థ. భారతీయ పురాణాల నుంచి ఈ పేరును తీసుకున్నారు. ఇది హిందూదేవీదేవతలతో ముడిపడి ఉంది. చంద్రయాన్-3 చంద్రుడిపై దిగిన రోజైన ఆగస్టు 23ని ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రధాని మోడీ ప్రకటించారు. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తన పాదముద్రలను వదిలిన ప్రదేశాన్ని ‘తిరంగా’ అని పిలుస్తామని, ఇది భారతదేశ ప్రతీ ప్రయత్నానికి ఒక ప్రేరణ అని, ఏ వైఫల్యం అయినా అంతిమం కాదని ఇది గుర్తు చేస్తుందని ఆయన అన్నారు.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ ఈ ఘటన సాధించింది. ఇదే కాకుండా అత్యంత కష్టసాధ్యమైన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై 14 రోజుల పాటు పనిచేసింది. అక్కడి మట్టిని విశ్లేషించింది.