Pakistan: భారత్‌తో వాణిజ్య సంబంధాల కోసం పాకిస్తాన్ ఆరాటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాపారవేత్తలు భారత్‌తో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో పిఠాపురం టీడీపీ నేతల భేటీ.. సీటుపైనే చర్చ!
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
తాజాగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై తమ దేశం సీరియస్‌గా దృష్టిసారించిదని అన్నారు. శనివారం లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ వ్యాపారవేత్తలు భారత్‌తో వాణిజ్యాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే, పొరుగుదేశంతో సంబంధాల పునరుద్ధరణపై ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాక్ మంత్రి వ్యాఖ్యలపై కామెంట్స్ చేశారు.
గత నెల ప్రారంభంలో పాకిస్తాన్‌కి కొత్త ప్రధానిగా రెండోసారి షెహజాబ్ షరీఫ్ ప్రమాణస్వీకరాం చేశారు. ప్రధాని మోడీ అతనికి శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ప్రతిగా షెహబాజ్ షరీఫ్ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రస్తుతం భారత్‌తో సంబంధాలు చాలా కీలకం. ప్రమాణస్వీకార సమయంలో పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జీ20 దేశాల జాబితాలో చేరడంతో పాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం తన ముందున్న కీలక లక్ష్యాలని చెప్పారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!