Mukhtar Ansari: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ జైలులో మరణించాడు. దాదాపుగా 60కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని జైలులో స్పృహ తప్పిపోయిన స్థితిలో సిబ్బంది గుర్తించి, హుటాహుటిని బండలోని రాణి దుర్గావతి వైద్య కళాశాలకు తరలించగా, గురువారం రాత్రి మరణించాడు.
AAP: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రేపు ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ వేదికగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు.
IT Jobs: H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగుల కోసం తమను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అమెరికన్ టెక్కీలు ఆరోపించడం సంచలనంగా మారింది. 20 మంది ఉద్యోగులను జాతి, వయస్సు వివక్ష ఆధారంగా తొలగించినట్లు వారు ఆరోపిస్తు్న్నారు. యూఎస్‌లో పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఈ ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మరోసారి పరోక్షంగా భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ‘‘ఇండియా ఔట్’’ నినాదంలో అధికారంలోకి వచ్చిన ఇతను, వచ్చీ రాగానే మాల్దీవుల్లోని భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు చైనా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాడు.
Coffee With Youth: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోడీ నేతృత్వంలో అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్డీయే కూటమి ఈ సారి 543 ఎంపీ స్థానాల్లో 400కి పైగా గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. బీజేపీ స్వతహాగా 370 స్థానాలు సాధించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేస్తోంది.
Baltimore Bridge Collapse: అమెరికాలో బాల్టిమోర్ వంతెన కార్గో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. డాలీ అనే పేరుతో సింగపూర్ ఫ్లాగ్ ఉన్న షిప్ బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజన్ వైఫల్యం ఎదురవ్వడంతో అదుపుతప్పి బ్రిడ్జ్ పిల్లర్‌ని ఢీకొట్టింది.
Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. శుక్రవారం భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు తెలిపింది.
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారన వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులకు సహకరించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేయగా.. ఇద్దరు నిందితులు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలపై ఎన్ఐఏ భారీ రివార్డు ప్రకటించింది.