Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Mukhtar Ansari Death: గ్యాంగ్‌స్టర్, మాజీ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ గుండెపొటుతో నిన్న జైలులో మరణించారు. అయితే, ఒకప్పుడు యూపీ రాజకీయాల్లో వెలుగువెలిగిన ఇతనికి అప్పటి ప్రభుత్వాలు ఎలా రక్షణగా నిలిచాయనే విషయాన్ని మాజీ పోలీస్ అధికారి వెల్లడించారు.
Vasooli Titans: భారత మమిళ క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ, కించపరిచేలా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. బీజేపీ నాయకులను హేళన చేస్తూ..‘‘ వసూలీ టైటాన్స్’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిని ఉపయోగించుకుని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.
Hardeep Singh Puri: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న కోర్టు మరోసారి ఆయనకు ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీని విధించింది. ఇదిలా ఉంటే తాజా పరిణామాలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pakistan: పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అయితే, ఈ పరిణామంపై చైనా తన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం పాక్-చైనా స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తోంది.
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ నిన్న జైలులో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అన్సారీ ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లకు చావు భయాన్ని చూపాడు. అయితే, ఎప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనా పగ్గాలు చేపట్టాడో అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌కు వణుకు మొదలైంది. తాజాగా అన్సారీ మరణంతో ఆయన వల్ల బాధింపడిన కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. మహిళలు వంటిళ్లకే పరిమితమయ్యారు. చివరకు బాలికల విద్యను కూడా తాలిబాన్లు నిషేధించారు.
Prank turns deadly: బెంగళూర్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితుడి ఆటపట్టించేందుకు చేసిన పని ప్రాణాన్ని తీసింది. నగరంలోని దేవనహళ్లి గ్రామీణ జిల్లాకు చెందిన యోగేష్‌ని బాధితుడిగా గుర్తించారు.