Venu Goapl Reddy
Author- NTV Telugu-
Israel-Iran War: ‘‘హిట్ లిస్ట్’’ రిలీజ్ చేసిన ఇరాన్..ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ..
Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. -
Uddhav Thackeray: నన్ను, శరద్ పవార్‌ని దెబ్బతీయాలని అమిత్ షా ఆదేశించారు..
Uddhav Thackeray: ప్రతిపక్ష నేతల్ని దెబ్బతీయాలని బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, ఎన్సీసీ(ఎస్పీ) శరద్ పవార్లను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ నేతలకు క్లోజ్ డోర్ మీటింగ్‌లో అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని అన్నారు. -
Cylinder on the track: రైల్వే ట్రాక్‌పై సిలిండర్.. సకాలంలో బ్రేకులు వేసిన లోకో పైలట్..
Cylinder on the track: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ రైల్వే ట్రాక్‌పై మరోసారి అనుమానాస్పద వస్తువు కనిపించింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లోక్‌పైలట్ ట్రాకుపై ఉన్న వస్తువుని గుర్తించి సకాలంలో బ్రేకులు వేశాడని పోలీసులు తెలిపారు. ట్రాక్‌పై ఎర్రని సిలిండర్‌ని గమనించి, దానికి దూరంగా రైలుని ఆపినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ దిమ్మలు గుర్తించిన అనేక కేసుల మధ్య తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. -
Rajnath Singh: భారత్‌తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
Rajnath Singh: పాకిస్తాన్‌ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్‌తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
Mini Moon: ఈ రోజు రాత్రి నుంచే చంద్రుడికి తోడుగా ‘‘మిని మూన్’’..
Mini Moon: భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే.. చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే, ఇప్పుడు మరో ‘‘మిని చంద్రుడు’’ కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ‘‘మిని మూన్’’ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతోంది. "2024 PT5" అని పిలవబడే ఇది కేవలం పది మీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న చంద్రుడు, 53 రోజుల పాటు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతాడు. ఆ… -
Tata Nexon EV Fire Case: టాటా నెక్సాన్ EV కేసు.. రూ. 19.55 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..
Tata Nexon EV Fire Case: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, గూడ్స్ రవాణా వాహనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలక్ట్రిక్ బైకుల నుంచి మంటలు చెలరేగిన సంఘటనలు చూశాం. -
Hassan Nasrallah: పేలుడు స్థలం నుంచి హిజ్బుల్లా చీఫ్ మృతదేహం రికవరీ.. మరణానికి కారణం ఇదే..
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ దాడిలో హతమయ్యాడు. లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంలో, శనివారం కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఏకంగా 80 బంకర్ బస్టర్ బాంబుల్ని ఉపయోగించి నస్రల్లా ఉన్న బంకర్‌ని పేల్చేసింది. నస్రల్లా చనిపోయినట్లు శనివారం ఇజ్రాయిల్ ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. -
Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?
Heart disease: స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా గుండె వ్యాధుల బారిన పడుతుండటం చూస్తాం. గుండెపోటు మరణాలు వంటివి పురుషులకే ఎక్కువగా వస్తుంటాయి. అయితే, దీనికి జీవసంబంధమైన, హార్మోన్, జీవనశైలి అలవాట్లు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. కార్డియో వాక్యులర్ డిసీసెస్(CVDs) ఏడాదికి 17.9 మిలియన్ల మరణాలకు కారణమవుతున్నాయి. స్త్రీలతో పోలిస్తే పురుషులు చాలా తరుచుగా చిన్న వయసులోనే ఈ జబ్బుల బారిన పడుతున్నారు. -
Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్‌గాంధీ మౌనం ఎందుకు..?
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు. -
Hassan Nasrallah: 60 అడుగుల లోతులో దుర్భేద్యమైన బంకర్.. అయినా, నస్రల్లాను ఎలా ఇజ్రాయిల్ చంపింది..?
Hassan Nasrallah: 30 ఏళ్లుగా ఇజ్రాయిల్‌కి సవాల్ విసురుతున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని శుక్రవారం వైమానికి దాడిలో హతమార్చింది. అత్యంతం గోప్యత పాటించే నస్రల్లాను టార్గెట్ చేసి బీరూట్‌పై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో నస్రల్లా మరణించాడు. ఇప్పుడు అతడి మరణం ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చింది. నస్రల్లాతో పాటు మిలిటరీ చైన్‌లోని అత్యంత కీలకమైన కమాండర్లు అందరిని ఇజ్రాయిల్ హతమార్చింది. ఫువాద్ షుక్ర్, అలీ కర్కీ, ఇబ్రహీం అఖిల్ ఇలా ఒక్కొక్కరుగా చనిపోయారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?