Venu Goapl Reddy
Author- NTV Telugu-
Maharashtra Elections: ఉద్ధవ్ సేన, కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ చెరో 85 సీట్లలో పోటీ..
Maharashtra Elections: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో పొత్తు చర్చలు ముగిసినట్లే కనిపిస్తోంది. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. -
Punjab and Haryana HC: భర్తని ‘‘నపుంసకుడు’’ అని పిలవడం మానసిక క్రూరత్వమే..
Punjab and Haryana HC: భర్తని ‘‘హిజ్దా’’(నపుంసకుడు) అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్‌ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది. -
PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..
PM Modi Xi Jinping: దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది. Read Also: KTR: నాంపల్లి కోర్టులో పరువునష్టం దావాపై కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్.. గల్వాన్ […] -
PM Modi: మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ.. మోడీతో ఇరాన్ అధ్యక్షుడి భేటీ..
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు. -
Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..
Batenge to Katenge: మహారాష్ట్ర ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మారుమోగుతోంది. మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో యోగి ఫోటో, నినాదంతో ప్లేక్సీలు వెలిశాయి. ముఖ్యంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు సందడి చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ నినాదం చాలా ఫేమస్ అయింది. ‘‘ విడిపోతే.. నాశనం అవుతాం’’ అని అర్థమయ్యే ఈ నినాదాన్ని హిందువుల ఐక్యత కోసం యోగి చెప్పినట్లు తెలుస్తోంది. Read Also: […] -
India Canada: లారెన్స్ బిష్ణోయ్ లింక్స్.. కెనడా ఆరోపణల్లో కీలక విషయాలు..
India Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు భారతదేశం గురించి రహస్య సమాచారాన్ని, కెనడాలో భారత జోక్యంపై అమెరికా వార్తాపత్రికతో పంచుకున్నారు. కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్ అమెరికా మీడియాకు తెలియజేసినట్లు కెనడా మంగళవారం నివేదించింది. కెనడియన్ ఫెడరల్ పోలీసులు ఆరోపించిన కొన్ని రోజులుకు ముందే సమాచారాన్ని అందించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. -
Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్తో ప్రాణాపాయ స్థితి..
Tuition Teacher: 9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం, బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలో ముంబైకి 58 కి.మీ దూరంలోని నల్లసోపరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
Flight Bomb Threats: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు.. ‘‘ఎక్స్’’పై కేంద్రం ఆగ్రహం..
Flight Bomb Threats: గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన రంగం తీవ్ర బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా ఇలా అన్ని సంస్థలకు చెందిన విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం నుంచి ఏకంగా 100కు పైగా విమానాలు బెదిరింపులు ఎదుర్కోన్నాయి. వీటిలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి.అయితే, వీటిలో చాలా వరకు బెదిరింపులు ఎక్స్(ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చినవే. -
PM Modi, Xi to meet: ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ.. 5 ఏళ్ల తర్వాత తొలి సమావేశం..
PM Modi Xi to meet: భారత-చైనా సరిహద్దుల్లో వాస్తవనియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసహరించుకున్నాయన్న ప్రకటన రావడం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా కజాన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో రేపు ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య భేటీ జరగబోతోంది. -
Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..
Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ నేరంలో నిందితుడిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఆగస్టు 28న 32 ఏళ్ల జ్యోత్స్నా ఆక్రేని అజయ్ వాంఖడే(33) హత్య చేశాడు. నాగ్‌పూర్‌లోని కైలాస్ నగర్‌కి చెందిన నిందితులు నాగాలాండ్‌లో పనిచేస్తున్నాడు. వివరాల ప్రకరాం.. ఇద్దరూ ఒక మ్యాట్రిమోనీ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?