PM Modi: ‘‘ఓటు బ్యాంకు కారణంతోనే కాంగ్రెస్ హాజరుకాలేదు’’ .. అయోధ్య మందిర ఆహ్వానం తిరస్కరించడంపై పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నాయని అన్నారు. ‘‘మనం పుట్టనప్పుడు, మన పార్టీ కూడా పుట్టనప్పుడు.. ఆ సమయంలో ఈ విషయాన్ని కోర్టులో విచారించవచ్చు. సమస్యకు పరిష్కారం ఉండవచ్చు. భారతదేశం విడిపోయిన సమయంలో ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఓటు బ్యాంకు రాజకీయల కోసం చేయలేదు’’ అని పీఎం ఆరోపించారు.
కోర్టులో కేసు నడుస్తునప్పుడు కూడా కోర్టు తీర్పును ఆలస్యం చేసేందుకు ప్రయత్నించారని, దీనిని ఓ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నారని ప్రధాని మండిపడ్డారు. ఒక వేళ రామమందిరం నిర్మిస్తే, వారు మిమ్మల్ని చంపేస్తారు, ఇలా వారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారని నిందించారు. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామ మందిరాన్ని నిర్మించామని అన్నారు. గతంలో సోమనాథ్ మందిరానికి డాక్టర్ రాజేంద్ర బాబు వెళ్లాని అనుకున్నారు, ఆ సమయంలో జనసంఘ్ కానీ, బీజేపీ కానీ లేవు, అయితే అతను వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్‌ని దుయ్యబట్టారు.
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
Read Also: Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
రామ మందిరాన్ని కట్టిన వాళ్లు, దాని కోసం కష్టపడిన వాళ్లు, మీ పాపాలన్నింటిని మరిచిపోయారని మీరు గర్వపడాలి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించారు, అయినా కూడా మీరు తిరస్కరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇలాంటివే జరుగుతాయని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రజలు తమ వేషధారణను ధరించాలని కోరుతారు, అలా నేను ధరించినా వారు ఎగతాళి చేస్తారు, వారిలో చాలా ద్వేషం ఉందని ఆరోపించారు.
రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు ఆహ్వానించాలని ట్రస్టు తన వద్దకు వచ్చినప్పుడు తనకు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారని, అయితే దీని కోసం ఎలా తనను తాను సమర్థుడిగా చేసుకోవాలనే విషయంపై కొందరు సాధువులను సంప్రదించి 11 రోజుల అనుష్టానాన్ని స్వీకరించానని ప్రధాని మోడీ చెప్పారు. దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం వెళ్లానని, అక్కడ కంబ రామాయణాన్ని చదివానని, 800 ఏళ్లకు పూర్వం కంబ రామాయణం సృష్టించినప్పుడు మొదటి పారాయణం ఇక్కడే జరిగిందని వారు తనకు చెప్పారని అన్నారు. రామమందిర విషయంలో 500 ఏళ్ల పోరాటాన్ని చూశామని, 140 కోట్ల విశ్వాసాన్ని, కలల్ని నేను చూశానని, దేశంలోని పేద ప్రజలు డబ్బులు ఇచ్చి దేవాలయాన్ని నిర్మించారని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!