Venu Goapl Reddy
Author- NTV Telugu-
Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..
Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ నేరంలో నిందితుడిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఆగస్టు 28న 32 ఏళ్ల జ్యోత్స్నా ఆక్రేని అజయ్ వాంఖడే(33) హత్య చేశాడు. నాగ్‌పూర్‌లోని కైలాస్ నగర్‌కి చెందిన నిందితులు నాగాలాండ్‌లో పనిచేస్తున్నాడు. వివరాల ప్రకరాం.. ఇద్దరూ ఒక మ్యాట్రిమోనీ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించారు. -
Maharashtra Elections: పొత్తుల సిగపట్లు.. మరోసారి ‘‘మహ వికాస్ అఘాడీ’’ భేటీ..
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు దాదాపుగా ఒక నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’లో ఇంకా పొత్తులు కన్ఫామ్ కాలేదు. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్‌కి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
India Russia: “మా సంబంధం చాలా దృఢం, ట్రాన్స్లేషన్ అక్కర్లేదు”.. పుతిన్ వ్యాఖ్యలపై మోడీ నవ్వులు..
India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు […] -
Jaishankar: రష్యా భారత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. యూఎస్, కెనడాలపై జైశంకర్ పరోక్ష దాడి..
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు. -
Crime: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం.. అత్తగారింటికి వెళ్తుండగా అఘాయిత్యం..
Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్‌లోని తన అత్తమామల ఇంటికి వెళ్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు. నిందితుడు కల్లు అలియాస్ ధర్మేంద్ర పాశ్వాన్(34) కాన్పూర్ నగరంలోని సేన్ వెస్ట్ పారాలో బాధితురాలు 29 ఏళ్ల మహిళ ఉంటున్న పరిసర ప్రాంతంలోనే నివసిస్తున్నాడు. -
Israel Hezbollah War: హిజ్బుల్లా బంకర్లో 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారం.. ఆయువుపట్టుపై ఇజ్రాయిల్ దెబ్బ..
Israel Hezbollah War: హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో హిజ్బుల్లా బంకర్ నుంచి ఏకంగా 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. హిజ్బుల్లాకు నిధులు, దాని కార్యకలాపాల కోసమే ఈ డబ్బును వినియోగిస్తున్నట్లు తెలిపింది. -
BRICS Summit: పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
BRICS Summit: 16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. -
Bulldozer Action: బహ్రైచ్ నిందితులపై బుల్డోజర్ యాక్షన్.. యోగి సర్కార్‌కి సుప్రీంకోర్టు వార్నింగ్..
Bulldozer Action: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో ఇటీవల దుర్గా నిమజ్జనం సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రాను వేరే వర్గం వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పోలీసులు మహ్మద్ ఫహీన్, మహ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మహ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ మరియు మహ్మద్ అఫ్జల్‌ని అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతున్న సమయంలో మహ్మద్ తలీమ్, మహ్మద్ సర్ఫరాజ్‌లను పోలీసులు ఎన్కౌంటర్ చేసి పట్టుకున్నారు. -
Uranium In Water: ఛత్తీస్‌గఢ్ 6 జిల్లాల్లో నీటిలో ప్రమాదకర స్థాయిలో ‘‘యురేనియం’’
Uranium In Water: ఛత్తీస్‌గఢ్‌లోని 6 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ‘‘యురేనియం’’ ఉందని తేలింది. అణు కార్యక్రమాల్లో ఉపయోగించి యూరేనియం మోతాదుకి మించి నీటిలో ఉండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. -
Air India Kanishka bombing case: “ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్” నిందితుడి హత్య కేసులో కీలక పరిణామం..
Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
తాజావార్తలు
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?