PM Modi: లోక్‌సభ తొలి విడత ఎన్నిల ఏప్రిల్ 19న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి దశలో పోటీ చేస్తున్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖ రాశారు. ప్రధానమంత్రి సందేశం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికీ చేరేలా బీజేపీ కసరత్తులో ఈ లేఖ భాగంగా కనిపిస్తోంది.
Russia-Ukraine War: రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతూనే ఉంది. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కొన్ని వారాల్లోనే ఓడిపోతుందనే అంచనాల నేపథ్యంలో అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సాయంతో రెండేళ్లుగా ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది.
Priyanka Gandhi: దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180 సీట్లకు మించి రావని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందనే నినాదాన్ని ఆమె బుధవారం తోసిపుచ్చారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు.
Amit Shah: నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Elon Musk: టెస్లా చీఫ్, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఎలక్ట్రిక్ కార్ నిర్మాణానికి సంబంధించి టెస్లా ప్లాంట్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. రామ నవమి రోజు బీజేపీ అల్లర్లు చేయాలని చూస్తోందని, ప్రజలను రెచ్చగొట్టాలని భావిస్తోందని బుధవారం ఆరోపించారు.