Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎన్నికలు 2024 చివరి దశకు చేరుకున్నాయి. రేపు జరిగే చివరిదైన ఏడో దశలో ముగియనున్నాయి. గత రెండు నెలలుగా సాగిన సుదీర్ఘ ప్రక్రియ భారతదేశంలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారో తేల్చనుంది.
Indian economy: జనవరి - మార్చి కాలంలో మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదైంది.దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాది(2022-23) ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో(జనవరి-మార్చి)తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.
Israel:బందీలను అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందం లేదన ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేసింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేని శుక్రవారం ఇజ్రాయిల్ సీనియర్ భద్రతా అధికారి చెప్పారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి యువతిని పెళ్లి నుంచి కిడ్నాప్ చేయాలని యత్నించాడు. రాష్ట్రంలోని అశోక్ నగర్‌కి చెందిన 22 యువతిపై నిందితుడు కాలు అలియాస్ సలీం ఖాన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
M Kharge: రేపటిలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగుస్తోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తుంటే, ఈ సారి బీజేపీని గద్దె దించుతామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Prajwal Revanna Arrest: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జేడీఎస్ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణంలో కీలక పరిణామం ఎదురైంది. ఈ కేసు బయటకు రాగానే ఇండియా నుంచి జర్మనీ వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ, ఈ రోజు తెల్లవారుజామున బెంగళూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.
Service Calls: దేశ ప్రజలు చట్టబద్ధమైన కాల్స్‌ని సులభంగా గుర్తించేందుకు కేంద్రం 10-అంకెల కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ని ప్రారంభించింది. టెలిమార్కెటర్ల నుంచి అయాచిత కాల్స్ గుర్తించేదుకు ఈ నిర్ణయం సహాయపడనుంది.
Madhya Pradesh High Court: ముస్లిం పురుషుడు, హిందూ మహిళ మధ్య వివాహం అనేది ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేసినప్పటికీ, ముస్లిం వ్యక్తిగత వివాహ చట్టం ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును చెప్పింది.
Jabalpur Double Murder: మధ్యప్రదేశ్ జబల్పూర్ జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మైనర్ బాలిక, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రిని, 8 ఏళ్ల తమ్ముడిని దారుణంగా హత్య చేసింది.