Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనొద్దని కాంగ్రెస్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎన్నికలు 2024 చివరి దశకు చేరుకున్నాయి. రేపు జరిగే చివరిదైన ఏడో దశలో ముగియనున్నాయి. గత రెండు నెలలుగా సాగిన సుదీర్ఘ ప్రక్రియ భారతదేశంలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారో తేల్చనుంది. రేపు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, ప్రతిపక్షాల ఇండియా కూటమిలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారనే విషయంపై కాస్త స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత దేశంలో ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి.
Read Also: India GDP 2024: 8.2 శాతానికి చేరుకున్న భారత జీడీపీ వార్షిక వృద్ధిరేటు..
Also Read
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో లోక్‌సభ ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. టీఆర్పీల కోసం ఊగాహానాల్లో మునిగిపోకూడదని తెలిపింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మీడియా విభాగం చైర్‌పర్సన్ పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని, వారి తీర్పు ఖాయమైందని చెప్పారు.
‘‘జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దానికి ముందు, TRP కోసం ఊహాగానాలు మరియు స్లగ్‌ఫెస్ట్‌లో మునిగిపోవడానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. భారత జాతీయ కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్‌పై చర్చలలో పాల్గొనదు. ఏదైనా చర్చ యొక్క ఉద్దేశ్యం ప్రజలకు తెలియజేయడమే. మేము జూన్ 4 నుండి చర్చలలో సంతోషంగా పాల్గొంటాము’’ అని పవన్ ఖేరా ఓ ప్రకటనలో తెలియజేశారు. పార్టీలో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Our statement on the reason for not participating in #ExitPolls
Voters have cast their votes and their verdict has been secured.
The results will be out on 4th June. Prior to that, we do not see any reason to indulge in speculation and slugfest for TRP.
The Indian National…
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 31, 2024
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!