Israel:బందీలను అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందం లేదన ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేసింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేని శుక్రవారం ఇజ్రాయిల్ సీనియర్ భద్రతా అధికారి చెప్పారు. గాజాలో ఇజ్రాయిల్ పోరాటాన్ని నిలిపేసినంత కాలం, పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఒక ఒప్పందాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Nivetha Pethuraj : పోలీసులతో నివేతా వాదన.. అస్సలు విషయం బయట పడిందిగా..
బందీల విడుదల ఒప్పందంలో భాగంగా కానీ ఏ సంధికి ఇజ్రాయిల్ ఒప్పుకోదని ఇజ్రాయిల్ చెప్పింది. ఇప్పటికే ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న గాజాలోని దక్షిణ భాగాన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. రఫాపై క్రమం తప్పకుండా దాడులు చేస్తోంది. ఇన్నాళ్లు ఉత్తరాన ఉన్న గాజా పట్టణాన్ని జల్లెడ పట్టినప్పటికీ, ఇజ్రాయిల్ బందీలను కనుగొనలేకపోయింది. దీంతో దక్షిణాన ఉన్న రఫా ప్రాంతంలో బందీలు ఉన్నట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఫాలోని హమాస్ స్థావరాలను నేలమట్టం చేసేందుకు దాడులు చేపడుతోంది. మరోవైపు ఇటీవల రఫాలోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో పిల్లలతో పాటు సాధారణ ప్రజలు మరణించడం అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ విమర్శలు ఎదుర్కొంది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడి 1200 మందిని హతమార్చారు. దీంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. గతంలో కుదిరిన సంధిలో హమాస్ మిలిటెంట్లు కొంతమంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మరో 90 మంది వరకు బందీలు హమాస్ చెరలో ఉన్నారు. ఇదిలా ఉంటే, హమాస్ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో 36 వేల మంది వరకు అమాయకపు పాలస్తీనా పౌరులు మరణించారు.