Service Calls: సేవలు, లావాదేవీ కాల్స్ కోసం కొత్త మొబైల్ సిరీస్‌ని ప్రారంభించిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Service Calls: దేశ ప్రజలు చట్టబద్ధమైన కాల్స్‌ని సులభంగా గుర్తించేందుకు కేంద్రం 10-అంకెల కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ని ప్రారంభించింది. టెలిమార్కెటర్ల నుంచి అయాచిత కాల్స్ గుర్తించేదుకు ఈ నిర్ణయం సహాయపడనుంది. సేవలు లేదా లావాదేవీలకు సంబంధించి కాల్స్ చేయడానికి ‘‘160xxxxxxx’’ అనే కొత్త నంబరింగ్ సిరీస్‌ను కేంద్రం గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయోషనల్/సర్వీస్/ లావాదేవీ వాయిస్ కాల్స్ చేయడానికి టెలిమార్కెటర్లకు ‘‘140xxxxxx’’ సిరీస్ కేటాయించబడింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DoT) ప్రకారం..‘‘140xx’’ సిరీస్‌ను ప్రమోషనల్ కాల్‌ల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నందున, వినియోగదారులు సాధారణంగా అలాంటి కాల్‌లకు ప్రతిస్పందించరు మరియు అనేక ముఖ్యమైన సర్వీస్/లావాదేవీ కాల్‌లు మిస్ అవుతున్నాయి అని పేర్కొంది.
Also Read
Read Also: Madhya Pradesh High Court: ముస్లిం యువకుడితో, హిందూ యువతి వివాహం చెల్లదు..
సర్వీస్/లావాదేవీ కాల్స్ చేయడానికి నిజమైన సంస్థలు సాధారణ 10- అంకెల నంబర్‌ని విస్తృతంగా ఉపయోగించుకునేలా చేసింది. అయితే అదే సమయంలో ఈ 10-అంకెల నంబర్‌ని ఉపయోగించి మోసగాళ్లు వినియోగదారుల్ని మోసం చేసే అవకాశం ఇచ్చిందని DoT చెప్పింది. దీన్ని పరిష్కరించడానికి కొత్త నంబరింగ్ సిరీస్ కేటాయించడం జరిగింది.
160xxxxxxx ఇది ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఎంటిటీల ద్వారా సర్వీస్/లావాదేవీ వాయిస్ కాల్‌ల కోసం ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏ, ఐఆర్డీఏ వంటి ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే సర్వీస్/లావాదేవీ కాల్స్‌లకు ఇకపై 1601 నుంచి ప్రారంభమవుతాయని డీఓటీ చెప్పింది.
తాజావార్తలు
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!