Sheikh Hasina: మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా.. ఏర్పాట్లు సిద్ధం..
- మరికొన్ని రోజులు ఇండియాలోనే షేక్ హసీనా..
- ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు..
- దేశాధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్..
- యూరప్‌లో ఆశ్రయం మరింత ఆలస్యం..
- ప్రధాని మోడీతో సమావేశం ఉండే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ తీవ్ర హింస, ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నిన్న బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమె ప్రస్తుతం భారత అధికారుల రక్షణలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా స్వల్పకాలి, దీర్ఘకాలిక ఆశ్రయం కోసం భారత భద్రతా సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆమెకు ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఎక్కువ కాలంలో దేశంలోనే ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు.. ఢిల్లీలో చర్చలు..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
77 ఏళ్ల మాజీ ప్రధానికి యూరోపియన్ దేశాలు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భద్రతా ఏజెన్సీలు ఇప్పటికే ఆమె రక్షణ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రధాని మోడీతో కూడామ ఆమె సమావేశం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. షేక్ హసీనా బస గురించి, యూరోపియన్ దేశాల్లో ఆమె ఆశ్రయం గురించి ఎప్పటికప్పుడు దోవల్ ప్రధాని మోడీకి అప్డేట్స్ అందిస్తున్నారు.
ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్‌లోని ఆమెకు బస ఏర్పాటు చేశారు. త్వరలోనే విశాలమైన, సురక్షితమైన ప్రదేశానికి మార్చబడుతుందని తెలుస్తోంది. భారత్ ప్రధాని లేదా ఇతర దేశాల అధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్‌నే షేక్ హసీనాకు ఇస్తోంది. షేక్ హసీనా బస కోసం దీర్ఘకాలిక ఏర్పాట్లను పరిగణలోకి తీసుకుని వైమానిక దళం, భద్రతా సంస్థలు ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి సఫ్దర్ జంగ్, పాలం విమానాశ్రయాల వరకు ప్రత్యేక కసరత్తు నిర్వహించాయి. ఆమె అంతర్గత భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కమాండోలను మోహరించినట్లు, వైమానిక దళానికి చెంది గరుడ్ కమాండోలు హిండన్ ఎయిర్ బేస్ బయట భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..