Helicopter crash: విమాన ప్రమాదాలకు నేపాల్ కేరాఫ్‌గా మారింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం ఆ దేశంలోని నువాకోట్‌లోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. హెలికాప్టర్ రాజధాని ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టింది.
Read Also: Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి రెస్క్యూ బృందాన్ని పంపింది. హెలికాప్టర్ మధ్యాహ్నం 1.54 గంటలకు ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత గ్రౌండ్ కంట్రోల్‌తో హెలికాప్టర్ సంబంధాలను కోల్పోయింది. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే చాపర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇలాగే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మరణించారు.