Sheikh Hasina: బంగ్లాదేశ్ హింస నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్ వచ్చేసింది. యూకేలో ఆమె ఆశ్రయం కోరిందని సమాచారం. అయితే, షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై పలువురు బంగ్లాదేశ్ నేతలు మండిపడుతున్నారు.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ అల్లర్ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, అస్సాంలో తగ్గుతున్న హిందూ జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
UP Cop: ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌కి చెందిన ఓ ఎస్ఐ లంచం కోరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆయన ఏం కోరాడంటే.. తనకు లంచంగా ‘‘5 కిలోల బంగాళాదుంపలు’’ కావాలని బాధితుడిని అడిగారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లంచానికి కోడ్ పదంగా ‘‘బంగాళాదుంపల్ని’’ ఉపయోగించాడు.
Maldives: ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చి, చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాన్ని అవలంభించిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకి త్వరగానే తత్వం బోధపడింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. శనివారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Rahul Gandhi: కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళలోని వయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 400 మంది కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం సంబంధాల మరింతగా పెరిగే విషయాన్ని జైశంకర్ నొక్కి చెప్పారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఆహ్వానం మేరకు జైశంకర్ ఆగస్టు 11 వరకు మూడు రోజుల పర్యటనకు వెళ్లారు.
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో ‘నియంతృత్వ పాలన’కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పిలునిచ్చారు.
Bangladesh: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకం మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఈ ఘటనల్లో 500 మందికి పైగా ప్రజలు మరణించారు. చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి రావాల్సి వచ్చింది.
Waqf Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లను కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించి సభలో ఆందోళన చేశాయి.