UP Serial Killer: గతేడాది కాలంగా ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా మహిళల హత్యలు సంచలనంగా మారాయి. 40-45 ఏళ్ల మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు జరిగాయి. పంట చేలు, చెరుకు తోటల్లో పనిచేస్తున్న మహిళల గొంతుకు చీరని బిగించి, గొంతు నులిమి హత్యలు జరిగాయి. మొత్తం 13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు ఒకే విధంగా జరిగాయి.
Anurag Thakur: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పాలస్తీనా, గాజా పట్ల ఆందోళన చెందే కాంగ్రెస్ పార్టీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు.
Scrub Typhus: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో తొలి మరణం సంభవించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు.
BJP: మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోవడానికి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ నిన్న ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.
Pakistan: పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన 27 ఏళ్ల అర్షద్ నదీమ్ జావలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నీరజ్ చోప్రా రజతంలో సరిపెట్టుకున్నాడు. నదీమ్ స్వర్ణం సాధించడం పట్ల పాకిస్తాన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నదీమ్ రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల త్రో సాయంతో స్వర్ణం సాధించారు
Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటంపై ఇరాన్ రగిలిపోతోంది.
PM Modi: ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతం , కొండచరియలు విరిగిపడిన సంఘటనతో మృతుల దిబ్బగా మారింది. ఈ ప్రమాదంలో 400కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయక పునారావాస చర్యల్ని సమీక్షించేందుకు పీఎం వయనాడ్ వెళ్తున్నారు.
Japan Earthquake: జపాన్‌లో వరసగా రెండో రోజు కూడా భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంఘం హెచ్చరికలు జారీ చేసిన ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో 5.3 తీవ్రవతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్‌లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
MP High Court: భార్యభర్తల విధులు, ఇంట్లో పనుల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య సమయానికి వంట చేయకపోవడం, భర్తని ఇంటి పనులు చేయమనడం, బట్టలు ఉతకమనడం ఆత్మహత్యకు ప్రేరేపిత కారణాలు కావని, ఈ సమస్యలు సామాన్యమైనవని,