Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శనివారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జిల్లాలోని అహ్లాన్ గాడోల్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. కోకెర్‌నాగ్ సబ్‌డివిజన్ ప్రాంతంలోని అడవుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి.
READ ALSO: Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ప్రత్యేక బలగాలు, సైన్యానికి చెందిన పారాట్రూపర్లు ఈ ఆపరేషన్ నిర్వహిస్తు్న్నాయి. గతేడాది సెప్టెంబర్లో కోకెర్‌నాగ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ సమయంలో ఆపరేషన్‌లో పాల్గొన్న కమాండిండ్ ఆఫీసర్, మేజర్, డీఎస్పీ మరణించారు. ఏడాది తర్వాత ఇదే ప్రాంతంలో మరోసారి కాల్పులు జరిగాయి. అహ్లాన్ గడోల్ అడవుల్లో దాడి ఉన్న ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు ఈ ప్రాంతానికి బలగాలను తరలించారు.