Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’.. 31 మంది సభ్యులు.. లిస్ట్ ఇదే..
- వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ..
- 31 మంది సభ్యులతో ఏర్పాటు..
- కమిటీలో లోక్‌సభ..రాజ్య సభ నుంచి సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లను కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించి సభలో ఆందోళన చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగంపై దాడిగా, మత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బిల్లుపై ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేసింది.
కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉండనున్నారు. తరుపది సమావేశాల్లో కమిటీ తమ నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. లోక్‌సభ నుంచి సభ్యులుగా ఎన్నికైన వారిలో 12 మంది అధికార బీజేపీ కూటమి అయిన ఎన్డీయే నుంచి ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 08 మంది, ప్రతిపక్షం నుంచి 09 మంది ఉన్నారు. రాజ్యసభ నుంచి బీజేపీకి చెందిన నలుగురు, కాంగ్రెస్ కూటమికి చెందిన ఎంపీలు నలుగురితో పాటు ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్వరలోనే కమిటీకి అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. బీజేపీకి చెందిన జగదాంబికా పాల్ అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Mamata Banerjee: డాక్టర్ హత్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.. అవసరమైతే నిందితుల్ని ఉరితీస్తామని ప్రకటన
లోక్‌సభ నుంచి సభ్యులు-వారి పార్టీలు:
బీజేపీ నుంచి: జగదాంబిక పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిత్ గంగోపాధ్యాయ, DK అరుణ
కాంగ్రెస్ నుంచి: గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొహమ్మద్ జావేద్
సమాజ్ వాదీ పార్టీ: మొహిబుల్లా
తృణమూల్ కాంగ్రెస్: కళ్యాణ్ బెనర్జీ
డీఎంకే: ఏ రాజా
టీడీపీ: లావు శ్రీకృష్ణ దేవరాయలు
జేడీయూ: దిలేశ్వర్ కమైత్
శివసేన (యూబీటీ): అరవింద్ సావంత్
ఎన్సీపీ(శరద్ పవార్): సురేష్ మాత్రే
శివసేన: నరేష్ మాస్కే
ఎల్జేపీ-రామ్ విలాస్: అరుణ్ భారతి
ఎంఐఎం: అసదుద్దీన్ ఓవైసీ
రాజ్యసభ సభ్యులు:
బీజేపీ : బ్రిజ్ లాల్, మేధా విశ్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్
కాంగ్రెస్: సయ్యద్ నసీర్ హుస్సేన్
టీఎంసీ: మహ్మద్ నడిముల్ హక్
వైఎస్సార్సీపీ: విజయసాయి రెడ్డి
డీఎంకే : మహ్మద్ అబ్దుల్లా
ఆప్: సంజయ్ సింగ్
నామినేటెడ్ సభ్యుడు: ధర్మస్థల వీరేంద్ర హెగ్డే
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!