Ajit Pawar: రాజకీయాలను ఇళ్లలోకి రానీవ్వకూడదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేకి వ్యతిరేకంగా తన భార్య సునేత్రా పవార్‌ని పోటీకి దింపడం ద్వారా తప్పు చేశానని అన్నారు.
Kolkata Doctor Case:దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది.
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. సోమవారం, యూపీ పోలీసులకు అర్ధరాత్రి 1.30 గంటలకు 112 హెల్ప్‌లైన్ నెంబర్‌కి రక్షించాలని ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ‘‘ నిన్న రాత్రి 1.30 గంటల సమయంలో యూపీ 112కి కాల్ వచ్చింది. అందులో ఓ అమ్మాయి తన బట్టలు విప్పి దాడికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది’’ అని కన్నౌజ్ ఎప్సీ అమిత్ కుమార్…
Rajasthan Shocker: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భర్త భార్యకు ఘోరమైన శిక్ష విధించారు. నాగౌర్ జిల్లాలో ఓ ఒక వ్యక్తి తన భార్య కాళ్లను బైకు కట్టి ఈడ్చుకెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె సహాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. నేలపై లాక్కెళ్లడంతో ఆమె శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. బాధతో ఆమె ఏడుస్తున్న తీరు హృదయవిదారకరంగా ఉంది.
Arshad Nadeem: అర్షద్ నదీమ్.. ఇప్పుడు ఈ పేరు పాకిస్తాన్లో సంచలనంగా మారింది. మన ఇండియా కూడా ఫేమస్ అయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్లో ఏకంగా స్వర్ణం సాధించాడు.
Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి తన నివేదికతో భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సెబీ చైర్‌పర్సర్ మధాబీ పూరి భుచ్పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు.
Rajeev Chandrasekhar: సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా నివేదికను రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు తోసిపుచ్చారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
Kolkata doctor case: కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఆర్జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై ఈ అఘాయిత్యానికి నిందితుడు ఒడిగట్టాడు. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్లో లభించింది.
St Martin's Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు.
China: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డ పైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్‌లో హనియే హత్యకు గురయ్యాడు.