Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?
- వయనాడ్ సందర్శించినందుకు ప్రధానికి రాహుల్ గాంధీ థాంక్స్..
- జాతీయ విపత్తుగా ప్రకటిస్తారనే నమ్మకం ఉందని వెల్లడి..
- ఈ రోజు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళలోని వయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 400 మంది కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్ పర్యటనకు వెళ్లారు. ఈ ఘటనలో బాధిత ప్రజలను నేరుగా కలిశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. స్థానిక ఆస్పత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శించారు. పర్యటనలో ఎంత మంతి పిల్లలు తమ వారిని పోగొట్టుకున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపీలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో పునరావాసం మరియు సహాయక చర్యల కోసం ₹ 2,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది.
Read Also: S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్‌తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
Also Read
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్‌ని సందర్శించడాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ‘‘ఈ భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంల తెలుసుకునేందుకు వయనాడ్‌ని సందర్శించినందుకు మోడీజీకి ధన్యవాదాలు. ఇది మంచి నిర్ణయం. విధ్వంసాన్ని ప్రధాని ప్రత్యక్షంగా చూసిన తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అంతకుముందు ప్రమాద ప్రాంతాన్ని రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. జూలై 30న, వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 416 మంది మరణించారు ,150 మందికి పైగా తప్పిపోయారు.
Thank you, Modi ji, for visiting Wayanad to personally take stock of the terrible tragedy. This is a good decision.
I am confident that once the Prime Minister sees the extent of the devastation firsthand, he will declare it a national disaster.
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2024
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!