Kolkata doctor case: వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు ముందు మద్యం.. విపరీతంగా పోర్న్ వీడియోలు..
- సంచలనంగా కోల్‌కతా డాక్టర్ హత్యాచారం..
- ఘటన సమయంలో మద్యం మత్తులో నిందితుడు..
- తరుచూ పోర్న్ చూసే అలవాటు.. మొబైల్ నిండా అవే వీడియోలు..
- విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata doctor case: కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఆర్‌జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై ఈ అఘాయిత్యానికి నిందితుడు ఒడిగట్టాడు. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్‌లో లభించింది. ఈ కేసు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు త్వరతిగతిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు. ప్రస్తుతం అతడిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.
ఇదిలా ఉంటే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్‌కి నాలుగు వివాహాలు జరిగాయని తెలుస్తోంది. అయితే, ఇతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు వదిలివెళ్లారని, మరో భార్య క్యాన్సర్‌తో మరణించినట్లు తెలిసింది. ఇక అత్యాచార ఘటనకు ముందు నిందితుడు మద్యం తాగి ఉన్నాడని, తరుచుగా అశ్లీల వీడియోలు చూస్తాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో సంజయ్ మద్యం సేవించడానికి ఆస్పత్రి వెనక ఉన్న ప్రదేశానికి వెళ్లాడని, అక్కడే మద్యం తాగుతూ పోర్న్ చూసినట్లు తెలుస్తోంది.
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
Read Also: Rape D OTT: నేరుగా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘రేప్ డీ’ మూవీ
విచారణ సమయంలో సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్ నుంచి అనేక హింసాత్మక అశ్లీల వీడియోలను కనుగొన్నారు. అతని మొబైల్ దాదాపుగా హింసాత్మక పోర్న్ వీడియోలతో నిండి ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడి మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడమో లేక వికృత శృంగార వాంఛలు ఉన్న వ్యక్తి అని తెలుపుతోంది. ఘటన జరిగిన రోజు సంజయ్ చాలా సార్లు ఆస్పత్రి ప్రాంగణంలోకి ప్రవేశించడాని పోలీసులు తెలిపారు. అత్యాచారం, హత్యకు గురై వైద్యురాలి మృతదేహం శుక్రవారం ఉదయం సెమినార్ హాల్‌లో కనుగొనబడింది.
ఘటన జరిగిన చెస్ట్ మెడిసిన్ విభాగానికి రెండు ఎంట్రీ పాయింట్ల ఉన్నట్లు తెలుస్తోంది. వెనక తులుపు తెరిచి ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ వెనుక ద్వారం ద్వారా ఐదు నుండి ఆరు మంది వ్యక్తులు డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజీలో బంధించబడిందని వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వ్యక్తులు ఆసుపత్రిలో చేరిన బంధువులకు వద్దకు వెళ్లినట్లు తేలింది. అయితే, రాత్రి సమయంలో సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారానికి పాల్పడేందుకు ఆ విభాగానికి వెళ్లినట్లు తెలుస్తోంది. నేరం చేసిన తర్వాత, రాయ్ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని తేలింది. ఘటనా స్థలం నుంచి రక్తపు మరకలను కడిగేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. CCTV ఫుటేజీలో రాయ్ ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుండి బయలుదేరినట్లు కూడా చూపబడింది. దీనికి తోడు ఘటన స్థలంలో లభించిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ నిందితుడి మొబైల్‌తో ఆటోమెటిక్‌గా కనెక్ట్ కావడంతో పోలీసులు సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!