Kolkata Doctor Case:దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో కోల్‌కతా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఛెస్ట్ మెడిసిన్‌లో పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతదేహం సెమినార్ హాలులో కనుగొనబడింది.
Read Also: US: బంగ్లాదేశ్ అల్లర్లతో సంబంధం లేదు.. ఖండించిన వైట్‌హౌస్
ప్రభుత్వ ఆధీనంలోని కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై కోర్టు ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడింది. అతను యాక్టివ్‌గా లేకపోవడం నిరుత్సాహపరుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ ఘటన తర్వాత ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన తర్వాత మరో కాలేజీలో ఇదే పోస్టును అప్పగించడంపై కోర్టు ధ్వజమెత్తింది. అతడిని వెంటనే విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని కోర్టు ఆదేశించింది. ఘోష్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమితులైనందుకు ప్రభుత్వాన్ని నిలదీసింది. “ప్రస్తుతం ఉన్న కేసు ఒక విచిత్రమైన కేసు. ఇకపై సమయం వృధా చేయకూడదు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండవచ్చు” అని కోర్టు పేర్కొంది. పాలక వర్గం బాధితుడితో కానీ బాధితురాలి కుటుంబంతో లేదని కోర్టు పేర్కొంది. ఘటన జరిగి 5 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ముఖ్యమైన నిర్ధారణలు లేవని, అందువల్ల సాక్ష్యాలు ధ్వంసం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని కోర్టు సమర్థించింది. తక్షణమే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడం సముచితమని కోర్టు పేర్కొంది.
బాధితురాలి ఒంటిపై తీవ్రగాయాలు కనిపించాయి. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగింది. మెడ వెముక ఫ్రాక్చర్ అయింది. ముఖంగాపై గోటిలో రక్కిన గుర్తులు ఉన్నాయి. ఆమెపై లైంగిక దాడి జరిగిందని తెలిసింది. ఆమె మృతదేహం సెమినార్ హాలులో కనిపించడం, ఆమె బట్టలు చిందరవందరగా, శరీరం అంతా గాయాలు కనిపించిన తర్వాత ఆస్పత్రి పరిపాలన ప్రతిస్పందించిన తీరుపై కోర్టు తీవ్ర లోపాలను గుర్తించింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుని కోరారు. కేవీ రాజేంద్రన్ కేసును ఉదహరించారు. ఈ కేసులో కొన్ని అరుదైన కేసుల్లో న్యాయపరమైన, పూర్తి దర్యాప్తును నిర్ధారించడానికి తప్పనిసరిగా బదిలీ చేసే అధికారాన్ని ఉపయోగించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న తీర్పును హైకోర్టు ఉదహరించి, సీబీఐకి కేసుని దర్యాప్తు చేసింది.