Kamikaze Drones: యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్న కామికేజ్ డ్రోన్లను భారతదేశం ఆవిష్కరించింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ ఇంజిన్‌తో తయారవుతున్న ఈ ఆత్మాహుతి డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్(NAL) తయారు చేస్తున్నట్లు తెలిపింది.
Arshad Nadeem: పాకిస్తాన్, అక్కడి ప్రజల్ని ఉగ్రవాదులతో విడదీసి చూడలేం. అక్కడి వారిలో ఉగ్రవాదం అంతగా పెనవేసుకుపోయింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన అర్షద్ నదీప్ జావెలన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచాడు. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చాడు.
Hamas Targets Israel: హమాస్‌కి చెందిన సాయుధ విభాగం ఆల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ఇజ్రాయిల్ వాణిజ్య నగరం టెల్ అవీవ్‌పై దాడి చేసింది. "M90" రాకెట్లతో నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసింది.
Raksha Bandhan: రక్షాబంధన్ కోసం వెళ్లే ఉద్యోగుకు ఏడు రోజులు జీతాన్ని కట్ చేయాలన్న కంపెనీ బాస్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్‌కి చెందిన మహిళ లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది.
Pappachan murder: కేరళలో పాపచ్చన్ అనే 82 ఏళ్ల వృద్ధుడి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. దురాశ, నమ్మక ద్రోహంతో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళా ఈ క్రూరమైన ప్లాన్‌కి స్కెచ్ వేసింది. ముందుగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన గ్యాంగ్, సీసీకెమెరాలను పరిశీలించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే, తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులు సంఘటితమయ్యారు. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపధ్యంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ రోజు హిందూ నాయకులను కలుసుకున్నారు. మంగళవారం ఢాకాలోని ఢాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రజలు ఓపికతో మెలగాలని, ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి మతంతో సంబంధం లేకుండా హక్కులు ఉన్నాయని అన్నారు.
Mars: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు, జీవరాశులపై ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మన సౌరకుటుంబంలోని అంగారక గ్రహం శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడు కూడా భూమి లాగే సముద్రాలు, సరస్సులు, నదులతో నిండి ఉండేదని చాలా పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న ఒక నిజం.
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది.
Allahabad HC: ‘‘ఉత్తర్ ప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టాన్ని’’ అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. భారత లౌకిక స్పూర్తికి ఇది నిదర్శమని చెప్పింది. ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి, దేశ లౌకిక స్వరూపాన్ని నిలబెట్టడానికి అవసరమని కోర్టు పేర్కొంది.
Iran-Israel Tensions: ఇరాన్ లేదా దాని ప్రాక్సీలు రానున్న రోజుల్లో ఇజ్రాయిల్‌పై దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ని ఉటంకిస్తూ వైట్‌హౌజ్ వర్గాలు హెచ్చరించాయి. ‘‘ఈ వారంలోనే దాడి జరిగే అవకాశం ఉంది’’ అని వైట్‌హౌజ్ ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బీ అన్నారు.