Fraud: హిందువుగా నటించి మహిళతో పెళ్లి.. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి..
- హిందువుగా నమ్మిస్తూ.. మహిళని పెళ్లి చేసుకున్న వ్యక్తి..
- కూతురు పుట్టిన తర్వాత ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: హిందువుగా నటించి ఓ మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల వ్యక్తి హిందువుగా చెప్పుకుంటూ మోసం చేశాడు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని సదరు మహిళని బలవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీలో జరిగింది.
Read Also: YS Jagan: గవర్నమెంట్ స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు?.. జగన్ తీవ్ర విమర్శలు
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ప్రాపర్టీ డీలర్, కాంట్రాక్టర్ అయిన మహ్మద్ అజం జైదీ అనే వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. 2016లో అమన్ అనే పేరు పెట్టుకున్న జైదీ తనను హిందువుగా మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు మహిళ ఆరోపించింది. తన భర్త నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత, మహిళ బెదిరింపులు మరియు లైంగిక వేధింపులను ఎదుర్కొందని అధికారి తెలిపారు.
ఫిర్యాదు తర్వాత చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సుధా సింగ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జైదీపై ఐపిసి సెక్షన్‌లు 498A (భార్య పట్ల క్రూరత్వం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) మరియు 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. యూపీ చట్టవిరుద్ధమైన మతమార్పిడి నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 2017లో కూతురికి జన్మనిచ్చిన మహిళపై పలు సార్లు దాడి చేయడంతో పాటు కూతురు పుట్టిన తర్వాత ఇస్లాంలోకి మారాలని బాధితురాలిపై జైదీ ఒత్తిడి చేయడం ప్రారంభించాడని కొత్వాలి ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ త్రిపాఠి తెలిపారు. కేసు నమోదైన 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.
- Tags
- crime
- fraud
- UP Fraud
- Uttar Pradesh
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!