Rajnath Singh: పాకిస్తాన్‌ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్‌తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Mini Moon: భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే.. చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే, ఇప్పుడు మరో ‘‘మిని చంద్రుడు’’ కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ‘‘మిని మూన్’’ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతోంది. "2024 PT5" అని పిలవబడే ఇది కేవలం పది మీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న చంద్రుడు, 53 రోజుల పాటు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతాడు. ఆ…
Tata Nexon EV Fire Case: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, గూడ్స్ రవాణా వాహనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలక్ట్రిక్ బైకుల నుంచి మంటలు చెలరేగిన సంఘటనలు చూశాం.
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ దాడిలో హతమయ్యాడు. లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంలో, శనివారం కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఏకంగా 80 బంకర్ బస్టర్ బాంబుల్ని ఉపయోగించి నస్రల్లా ఉన్న బంకర్‌ని పేల్చేసింది. నస్రల్లా చనిపోయినట్లు శనివారం ఇజ్రాయిల్ ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
Heart disease: స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా గుండె వ్యాధుల బారిన పడుతుండటం చూస్తాం. గుండెపోటు మరణాలు వంటివి పురుషులకే ఎక్కువగా వస్తుంటాయి. అయితే, దీనికి జీవసంబంధమైన, హార్మోన్, జీవనశైలి అలవాట్లు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. కార్డియో వాక్యులర్ డిసీసెస్(CVDs) ఏడాదికి 17.9 మిలియన్ల మరణాలకు కారణమవుతున్నాయి. స్త్రీలతో పోలిస్తే పురుషులు చాలా తరుచుగా చిన్న వయసులోనే ఈ జబ్బుల బారిన పడుతున్నారు.
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.
Hassan Nasrallah: 30 ఏళ్లుగా ఇజ్రాయిల్‌కి సవాల్ విసురుతున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని శుక్రవారం వైమానికి దాడిలో హతమార్చింది. అత్యంతం గోప్యత పాటించే నస్రల్లాను టార్గెట్ చేసి బీరూట్‌పై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో నస్రల్లా మరణించాడు. ఇప్పుడు అతడి మరణం ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చింది. నస్రల్లాతో పాటు మిలిటరీ చైన్‌లోని అత్యంత కీలకమైన కమాండర్లు అందరిని ఇజ్రాయిల్ హతమార్చింది. ఫువాద్ షుక్ర్, అలీ కర్కీ, ఇబ్రహీం అఖిల్ ఇలా ఒక్కొక్కరుగా చనిపోయారు.
ఇదిలా ఉంటే, తాజాగా మరో గుండె ఆగిపోయింది. నాగ్‌పూర్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 40 ఏళ్ల వ్యక్తి ఆఫీసులోనే గుండెపోటుతో మరణించాడు. వాష్ రూమ్ వెళ్లి నితిన్ ఎడ్విన్ మైఖేల్ అనే వ్యక్తి అక్కడే కుప్పకూలిపోయాడు
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.
Hezbollahs: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్‌పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్‌లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.