Mahindra Thar Roxx: మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడర్ థార్ రాక్స్ రికార్డ్ సృష్టిస్తోంది. 5-డోర్ వెర్షన్‌గా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బుకింగ్స్‌లో థార్ రాక్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ప్రారంభించిన 60 నిమిషాల్లోనే థార్ రాక్స్ ఏకంగా 1,76,218 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. దసరా నుంచి ఈ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి.
Zakir Naik: తీవ్రవాద సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కి పాకిస్తాన్ ఘనంగా స్వాగతం పలికింది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న జకీర్ నాయక్ గత కొన్నేళ్లుగా మలేసియాలో ఆశ్రయం పొందుతున్నాడు. జకీర్ పాకిస్తాన్ వెళ్లిన సందర్భంలో ప్రధాని షెహజాబ్ షరీఫ్‌తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇతడి పర్యటన భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
UP Shocker: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో విషాదకర సంఘటన జరిగింది. పిల్లలు బెలూన్లతో సరదాగా ఆడుకుంటారు, అయితే ఈ బెలూన్ 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. బాలిక బెలూన్‌తో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఆమె మరణించింది. పేలిన బెలూన్ బాలిక గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు విడిచింది.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరుపున కమలా హారిస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబర్‌లో అగ్రరాజ్య అధినేతను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటు, ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ ‘‘ఆటోమేటెడ్ మెసేజ్’’కి భారతదేశ యూజర్ ఇచ్చిన సమాధానం సమాధానం తెగవైరల్ అవుతోంది.
Congress: వీర్ సావర్కర్‌ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సావర్కర్ ‘‘గొడ్డు మాంసం’’ తినేవాడని అతను వ్యాఖ్యానించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. వినాయక్ దామోదర్ మాంసాహారే అని గోహత్యకు వ్యతిరేకం కాదని ఆయన కామెంట్స్ చేశారు.
Delhi Drug Case: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన కేసులో ప్రధాన సూత్రధారి కాంగ్రెస్ కార్యకర్త అని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యకర్తగా ఆరోపించబడుతున్న ఇతడికి ఆ పార్టీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన దాడిలో రూ. 5600 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్,40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి తుషార్ గోయల్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
Uddhav Thackeray: ప్రతిపక్ష నేతల్ని దెబ్బతీయాలని బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, ఎన్సీసీ(ఎస్పీ) శరద్ పవార్లను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ నేతలకు క్లోజ్ డోర్ మీటింగ్‌లో అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని అన్నారు.
Cylinder on the track: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ రైల్వే ట్రాక్‌పై మరోసారి అనుమానాస్పద వస్తువు కనిపించింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లోక్‌పైలట్ ట్రాకుపై ఉన్న వస్తువుని గుర్తించి సకాలంలో బ్రేకులు వేశాడని పోలీసులు తెలిపారు. ట్రాక్‌పై ఎర్రని సిలిండర్‌ని గమనించి, దానికి దూరంగా రైలుని ఆపినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ దిమ్మలు గుర్తించిన అనేక కేసుల మధ్య తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది.