Kash Patel: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రాట్ల పక్షాన కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత మూలాలు ఉన్న కాష్ పటేల్‌కి అత్యున్నత బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ట్రంప్‌కి సన్నిహిత రాజకీయ సహాయకుడిగా ఉన్న కాష్ పటేల్.. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ‘‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA)కి పటేల్ నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు.
44 ఏళ్ల కాష్ పటేల్ జాతీయ భద్రతా మండలిలో ట్రంప్‌కి ఉగ్రవాద నిరోధక సలహాదారుగా, తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీగా, ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి కెనడాకు అక్కడ నుంచి యూఎస్ఏకి వలస వచ్చారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కాష్ పటేల్ జన్మించారు. పటేల్ తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
Read Also: Snakes and Ladders: మూడు షిఫ్టుల్లో ముగ్గురు దర్శకులు చేసిన ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’
పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషణ్ పూర్తి చేసిన తర్వాత, పటేల్ ప్రతిష్టాత్మక లా సంస్థలో జాబ్ సంపాదించాలనుకుని విఫలమయ్యాడు. బదులుగా అతను పబ్లిక్ డిఫెండర్‌గా మారారు. న్యాయశాఖలో చేరడానికి ముందు మయామిలోని లోకల్ అండ్ ఫెడరరల్ కోర్టుల్లో 9 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ సన్నిహితుడైన రెప్.డెవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా నియమించబడ్డాడు.
కాష్ పటేల్ ‘‘న్యూన్స్ మోమో’’ అని పిలిచే రచయితకు సాయం చేశాడు. ఇది ట్రంప్ ప్రచార వాలంటీర్లపై నిఘా పెట్టడానికి వారెంట్ పొందడంలో యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ తప్పు చేసిందని వివరించినట్లు ఫస్ట్ పోస్ట్ నివేదించింది. మోమో విడుదలపై న్యాయ శాఖ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ పరిణామాలు కాష్ పటేల్ ట్రంప్ దృష్టిలో పడేలా చేశాయి. తర్వాత పటేల్ జాతీయ భద్రతా మండలిలో పనిచేయడానికి నియమించబడ్డాడు. ప్రస్తుతం ట్రంప్ గెలిస్తే, కాష్ పటేల్ కీలకమైన పొజీషన్‌లో ఉంటాడని తెలుస్తోంది.