Nidhi Tewari: ప్రధాని నరేంద్రమోడీ తదుపరి ప్రైవేట్ సెక్యూరిటీగా 2014 ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమె ప్రస్తుతం, ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆమె ఈ పదవిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారు. మంగళవారం ఆమె నియామకాన్ని ధ్రువీకరిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT) నుండి ప్రకటన వెలువడింది.
Read Also: Health Tips: నెల పాటు ప్రతిరోజూ 20 పుష్-అప్‌లతో శరీరంలో అద్భుతమైన మార్పులు..
‘‘ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నిధి తివారీ, IFS (2014) ను ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా, పే మ్యాట్రిక్స్ యొక్క లెవల్ 12 లో, కో-టెర్మినస్ ప్రాతిపదికన లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది వెంటనే అమల్లోకి వచ్చేలా నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది’’ అని సంబంధిత మంత్రిత్వ శాఖ మార్చి 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అతి పిన్న వయసులోనే ఈ పదవి చేపట్టబోతున్న తొలి వ్యక్తిగా నిధి తివారీ నిలుస్తారు.
సివిల్ సర్వీస్‌కి రాక ముందు నిధి తివారీ వారణాసి అసిస్టెంట్ కమిషనర్(కమర్షియల్ టాక్స్)గా పనిచేశారు. 2013 యూపీఎస్‌సీ నిర్వహించిన పరీక్షల్లో ఆమె 96 ర్యాంక్ సాధించారు. పీఎంఓలో చేరకముందు ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. 2022లో ఆమె ప్రధానమంత్రి కార్యాలయంలో అండర్ సెక్రటరీగా చేరారు. 2023లో డిప్యూటీ సెక్రటరీ పదవికి పదోన్నతి పొందారు. పీఎంఓలో ఆమె ‘‘ఫారిన్ అండ్ సెక్యూరిటీ’’ విభాగంలో పనిచేశారు. నిధి తివారీ 2014 నుంచి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. వారణాసిలోని మహమూర్ గంజ్ ప్రాంత నివాసి.