Punjab and Haryana HC: భర్తని ‘‘హిజ్దా’’(నపుంసకుడు) అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్‌ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది.
PM Modi Xi Jinping: దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది. Read Also: KTR: నాంపల్లి కోర్టులో పరువునష్టం దావాపై కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్.. గల్వాన్ […]
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు.
Batenge to Katenge: మహారాష్ట్ర ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మారుమోగుతోంది. మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో యోగి ఫోటో, నినాదంతో ప్లేక్సీలు వెలిశాయి. ముఖ్యంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు సందడి చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ నినాదం చాలా ఫేమస్ అయింది. ‘‘ విడిపోతే.. నాశనం అవుతాం’’ అని అర్థమయ్యే ఈ నినాదాన్ని హిందువుల ఐక్యత కోసం యోగి చెప్పినట్లు తెలుస్తోంది. Read Also: […]
India Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు భారతదేశం గురించి రహస్య సమాచారాన్ని, కెనడాలో భారత జోక్యంపై అమెరికా వార్తాపత్రికతో పంచుకున్నారు. కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్ అమెరికా మీడియాకు తెలియజేసినట్లు కెనడా మంగళవారం నివేదించింది. కెనడియన్ ఫెడరల్ పోలీసులు ఆరోపించిన కొన్ని రోజులుకు ముందే సమాచారాన్ని అందించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Tuition Teacher: 9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం, బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలో ముంబైకి 58 కి.మీ దూరంలోని నల్లసోపరాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Flight Bomb Threats: గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన రంగం తీవ్ర బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా ఇలా అన్ని సంస్థలకు చెందిన విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం నుంచి ఏకంగా 100కు పైగా విమానాలు బెదిరింపులు ఎదుర్కోన్నాయి. వీటిలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి.అయితే, వీటిలో చాలా వరకు బెదిరింపులు ఎక్స్(ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చినవే.
PM Modi Xi to meet: భారత-చైనా సరిహద్దుల్లో వాస్తవనియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసహరించుకున్నాయన్న ప్రకటన రావడం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా కజాన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో రేపు ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య భేటీ జరగబోతోంది.
Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ నేరంలో నిందితుడిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఆగస్టు 28న 32 ఏళ్ల జ్యోత్స్నా ఆక్రేని అజయ్ వాంఖడే(33) హత్య చేశాడు. నాగ్‌పూర్‌లోని కైలాస్ నగర్‌కి చెందిన నిందితులు నాగాలాండ్‌లో పనిచేస్తున్నాడు. వివరాల ప్రకరాం.. ఇద్దరూ ఒక మ్యాట్రిమోనీ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు దాదాపుగా ఒక నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’లో ఇంకా పొత్తులు కన్ఫామ్ కాలేదు. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్‌కి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.