Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2016లో ఆయన సాధించిన ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలను అందుకున్నారు. ముఖ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయించి స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ సత్తా చాటాడు. ఏకంగా 7 స్వింగ్ రాష్ట్రాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాడు. తాజాగా అరిజోనాని కూడా ట్రంప్ తన ఖతాలో వేసుకోవడంతో మొత్తం స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించారు.
Read Also: Ajit Pawar: సీఎం యోగి ‘‘బాటేంగే’’ నినాదం మహారాష్ట్రలో పనిచేయదు..
అమెరికా ఎలక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లలో 270 ఓట్లు సాధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు. అయితే, తాజా లెక్కల ప్రకారం ట్రంప్‌కి ఇప్పటి వరకు 312 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో 304 ఎలక్టోరల్ ఓట్లను సాధించాడు. జార్జియా, పెన్సిల్వేనియా, మిచిగాన్ మరియు విస్కాన్సిన్ వంటి స్వింగ్ రాష్ట్రాలతో సహా 50 రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. గత ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలను కూడా ఈ సారి ట్రంప్ గెలిచారు. నార్త్ కరోలినా, నెవెడా బ్యాటిల్ స్టేట్స్‌ని కూడా గెలుచుకున్నారు. కమలా హారిస్‌కి ఈ ఎన్నికల్లో కేవలం 226 ఓట్లు మాత్రమే వచ్చాయి.