Tulsi Gabbard: ఎవరు ఈ తులసీ గబ్బార్డ్..? యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియామకం..
- యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్.., భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి హిందూగా గుర్తింపు.., ట్రంప్ గట్టి మద్దతుదారుల్లో తులసీ ఒకరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tulsi Gabbard: అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ముందే తన టీమ్‌ని ఖరారు చేసుకుంటున్నాడు. తాజాగా మాజీ డెమొక్రాటిక్ ప్రతినిధి నుంచి ట్రంప్ మద్దతుదారుగా మారిన తులసీ గబ్బార్డ్‌ని తన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె కింద మొత్తం అమెరికాలోని 18 గూఢచార ఏజెన్సీలు పనిచేస్తాయి.
2022లో డెమొక్రాటిక్ పార్టీని వీడిన తర్వాత గబ్బార్డ్ ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్‌కి ఆమోదం తెలిపారు. ట్రంప్‌కి ఎన్నికల్లో గట్టి మద్దతుదారుగా మారారు. ‘‘తులసీ గబ్బార్డ్ తమ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకి అద్భుతమైన స్పూర్తిని తీసుకువస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. గతంలో ఈమె ఉక్రెయిన్‌కి అమెరికా మద్దతుని వ్యతిరేకించారు.
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
తులసీ ప్రారంభ జీవితం:
తులసీ గబ్బార్డ్ ఏప్రిల్ 12, 1981న అమెరికన్ సమోవాలోని లెలోలోవాలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసున్న సమయంలో ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది. ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి మైక్ గబ్బార్డ్ రిపబ్లికన్ పార్టీ నుంచి డెమొక్రాట్స్‌కి మారాడు. హవాయి స్టేట్ సెనెటర్‌గా పనిచేశాడు. ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్‌ని వివాహం చేసుకుంది. గబ్బార్డ్ ఆర్మీ నేషనల్ గార్డ్,2లో రెండు దశాబ్ధాలుగా పనిచేశారు. ఆమె ఇరాక్, కువైట్ లో పనిచేశారు.
కాంగ్రెస్‌కి ఎన్నికైన మొదటి హిందువు:
గబ్బార్డ్ హవాయి ప్రతినిధుల సభకు 21 ఏళ్లలో ఎన్నికయ్యారు. ఆమె సభలో మొదటి హిందూ సభ్యురాలిగా అవతరించింది. భగవద్గీతపై ప్రమాణస్వీకారం చేశారు.
అధ్యక్ష పదవి కోసం:
2020లో అధ్యక్ష పదవి కోసం డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని కోరడంతో తులసీ పేరు ఒక్కసారిగా మారుమోగింది. విదేశీ సైనిక సంఘర్షణల్లో అమెరికా ప్రమేయాన్ని ఆమె వ్యతిరేకించింది. ఆమె ఆ తర్వాత రేసు నుంచి వైదొలిగింది. చివరి ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ని రూపొందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత డెమెక్రటిక్ పార్టీని వీడారు.
ట్రంప్ కోసం ప్రచారం:
ఈ ఏడాది ప్రారంభంలో గబ్బార్డ్ డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ఇచ్చారు. అక్టోబర్‌లో నార్త్ కరోలినాలో జరిగిన ర్యాలీలో ఆమె అధికారికంగా రిపబ్లిక్‌గా మారుతున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!