Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై అక్కడి మతోన్మాదుల మూక దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెని రక్షించాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. జర్నలిస్ట్ కారును గుంపు అడ్డగించి, ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. చుట్టుపక్కల జనాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆమెను పోలీసులు రక్షించి తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయాని తరలించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఆమెను అరెస్ట్ చేయలేదని తెల్లవారుజామున విడుదల చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు వారు తెలిపారు. “పోలీసులు మున్నీ సాహాను అదుపులోకి తీసుకోలేదు. ఆమె కార్యాలయం వెలుపల ఉన్న కవ్రాన్ బజార్ వద్ద కొంతమంది వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు. తరువాత, భద్రతా కారణాల దృష్ట్యా తేజ్‌గావ్ పోలీసులు ఆమెను DB కార్యాలయానికి తీసుకెళ్లారు” అని ఒక అధికారి వెల్లడించారు.
Read Also: Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ భయపడి పారిపోయాడు: టీడీపీ నేత
సాహా నాలుగు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని, బెయిల్ కోసం కోర్టుకు హాజరుకావాలని, భవిష్యత్తులో పోలీస్ సమన్లను పాటించాలని అధికారులు తెలిపారు. సాహాను వేధించిన వ్యక్తులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వైరల్‌గా మారిన ఈ దాడి వీడియోలో..57 మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబంధించి ఆమె ప్రజల్ని తప్పుదారి పట్టించిందని ఆరోపించడం వినవచ్చు. మీరు ఈ దేశాన్ని భారత్‌లో భాగం చేయడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు, విద్యార్థుల రక్తం మీ చేతులకు అంటుకుంది అని ఆమెను ఉద్దేశించి ఆరోపించారు. మీరు ఈ దేశ పౌరురాలిగా ఉండీ, ఈ దేశాని ఎలా హాని చేస్తారని..? గుంపు ప్రశ్నించింది.
55 ఏళ్ల జర్నలిస్ట్ బెంగాలీ ఛానెల్ ATN న్యూస్ మాజీ న్యూస్ హెడ్. హసీనా పాలన తర్వాత ఆమెతో పాటు అనేక మంది జర్నలిస్టులపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మోపబడ్డాయి. ఇటీవల హిందువులపై జరిగిన హింసను సాహా చూపించారు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామి వంటి మతోన్మాద సంస్థలు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని పోలీసులు దేశద్రోహం కింద అరెస్ట్ చేయడంతో అక్కడి పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి.
কারওয়ানবাজার থেকে সাংবাদিক মুন্নী সাহা গ্রেপ্তার |
Munni Saha Arrest | Channel 24 pic.twitter.com/xq7x0HHkzd— Md. Sohel Rana (@mdsohelrana7707) December 1, 2024