CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
- ఢిల్లీ వర్సిటీ ఫలితాలపై CJP నేత సౌరవ్ దాస్ స్పందన
- ప్రతిపక్ష ఓట్లు చీలడంతో ABVPకి ప్రయోజనం కలిగిందని వ్యాఖ్య
- ఎన్నికల్లో గెలిచిన వారు ‘రాజులు, రాణులు కాదు’ అంటూ దాస్ వ్యాఖ్యలు
- కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాన్ని సరిదిద్దుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు సౌరవ్ దాస్ స్పందించారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ABVP గెలించిందని అన్నారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మెజారిటీ విద్యార్థులు ఉన్నప్పటికీ, ఓటు విభజన కారణంగా ఫలితాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ‘‘రాజులు లేదా రాణులు కాదు’’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సౌరవ్ దాస్ అన్నారు. మెజారిటీ విద్యార్థులు వారికి ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ దాని సంస్థాగత విభాగాలు సీజేపీపై దృష్టి పెట్టడం కన్నా తమ రాజకీయ వ్యూహాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ మార్పు ప్రక్రియ 12 ఏళ్లుగా కొనసాగుతోందని, ప్రజలు సహనం కోల్పోతున్నారని అన్నారు. NSUI టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్‌గా భారీ మెజారిటీతో గెలిచిన దీపాంశు షోకీన్‌ను ఉదాహరణగా సౌరవ్ దాస్ ప్రస్తావించారు. లెఫ్ట్ పార్టీల్లో కొన్ని వర్గాలు ‘‘సైద్ధాంతిక స్వచ్ఛత, ప్రత్యేకత’’పై దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇదే తరహాలో ఉంటే, ఐక్యంగా లేకపోతే, వారు ప్రతిపక్షంలోనే కొనసాగాల్సి వస్తుందని అన్నారు.
Also Read
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
DUSU ఎన్నికల్లో ABVP నాలుగు కేంద్ర పదవుల్లో మూడింటిని గెలుచుకుంది. యశ్ దబాస్ అధ్యక్షుడిగా, రియా ఛావ్డీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. ఈ విజయం బీజేపీలో జోష్ నింపాయి. ఏబీవీపీ అభ్యర్థుల విజయంపై కేంద్రమంత్రులు, బీజేపీ లీడర్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!