IndiGo chaos: 1000 పైగా విమానాలు రద్దు, డీజీసీఏ నిబంధనల్ని పాటించకుండా, ప్రభుత్వానికే సవాల్ విసిరేలా ‘‘ఇండిగో’’ ప్రవర్తించిన తీరును దేశం మొత్తం గమనిస్తోంది. లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలకు కారణమైంది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్, మార్కెట్లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని […]
New Hyundai Venue: ఇటీవల Hyundai Venue కొత్త రూపంలో లాంచ్ అయింది. గతంలో పోలిస్తే మరింత పెద్దదిగా, మరిన్ని లోడెడ్ ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం, కార్ మార్కెట్లో Hyundai Venueకు భారీ డిమాండ్ నెలకొంది. Hyundai తన కొత్త కారు బుకింగ్స్‌ను అక్టోబర్ 24 నుంచి ప్రారంభించింది. నవంబర్ 4న ధరల్ని ప్రకటించింది. అప్పటి నుంచి వెన్యూ బుకింగ్స్ స్పీడ్ అందుకుంది. ప్రారంభించిన నెలలోనే 32,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. నవంబర్ […]
Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tata Harrier.ev: టాటా మోటార్స్(Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నెక్సాన్.ev (Nexon.ev ) టాప్ పొజిషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు హారియర్ఈవీ (Harrier.ev) కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన హారియర్ ఈవీ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్రిక్ SUVగా మారింది. నెక్సాన్.ఈవీని దాటి సేల్స్‌ను హారియర్ ఈవీ సేల్స్‌లో దూసుకుపోతోంది.
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది.
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
Congress: కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్‌కు ఆహ్వానం అందింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షామ్‌గఢ్ నగరంలో శుక్రవారం 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్ అవ్వడం, ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్న భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. బాధితురాలు 12వ తరగతి చదువుతోంది.
Modi's gifts to Putin: నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా స్వాగతించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా పుతిన్‌కు మోడీ పలు గిఫ్ట్‌లను ఇచ్చారు. బ్రహ్మపుత్ర సారవంతమైన నేతల్లో పండిన అస్సాం బ్లాక్ టీ, ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్, చేతితో తయారు చేసిన వెండి గుర్రం, ఆగ్రా నుంచి పాలరాయి చెస్ సెట్, కాశ్మీరీ కుంకుమ పుప్పు, రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను బహుకరించారు.