Tamil Nadu: బుల్లెట్ బండి నడిపినందుకు.. దళిత విద్యార్థి చేతులు నరికివేత..
- బుల్లెట్ బండి నడిపినందుకు దళిత విద్యార్థిపై దాడి..
- కుల దురహంకారంతో ప్రవర్తించిన నిందితులు..
- విద్యార్థిపై దాడి చేసి చేతులు నరికివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: పెరియార్ సిద్ధాంతం, కుల-మత రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పే తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కుల దురహంకారం, పరువు హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని మెలపిడావూర్ సమీపంలో దళిత విద్యార్థిపై అగ్రకులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతడి చేతులు నరికేశారు. ప్రభుత్వ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితుడు అయ్యసామి(20) బుధవారం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దాడికి గురయ్యాడు.
Read Also: Titanic Submersible: సముద్రగర్భంలో “టైటానిక్ సబ్‌మెర్సిబుల్” విషాదం.. పేలుడు క్షణాల ఆడియో వైరల్..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయ్యసామి తల్లి ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు, దాడికి పాల్పడే ముందు కుల దూషణలు చేశారని చెప్పింది. దాడికి గురైన బాధితుడిని గ్రామస్తులు మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు నిందితులు వినోద్, ఆది ఈశ్వరర్, వల్లరసులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బుల్లెట్ బండి నడిపినందుకు అగ్ర కులస్తులు ఈ దాడికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. బాధితుడు అయ్యసామి అంకుల్ గతేడాది బుల్లెట్ బండి కొనిచ్చాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండితో కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాడి జరిగింది. చేతుల్ని నరికేసి, ‘‘ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి బుల్లెట్ బండి ఎలా నడపగలడు?’’ అంటూ నిందితులు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాధితుడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. అయితే, ఆపరేషన్ సంక్లిష్టంగా ఉందని, ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!