Sambhaji Maharaj: ఇటీవల మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ మొఘల్ పాలకుడు ఔరంగజేబుని ప్రశంసించడం వివాదంగా మారింది. శివసేన, బీజేపీ అతడిపై విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇదిలా ఉంటే, మరాఠా పాలకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అబూ అజ్మీ నివాళులు అర్పించారు. ఆయన పరాక్రమ యోధుడని ప్రశంసించారు.
Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. ముఖ్యంగా, పాకిస్తాన్‌తో కలిసి బంగ్లా ఆర్మీ చీఫ్‌ని మార్చడం లేదా ఆర్మీలో తిరుగుబాటు తేవడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. క్వార్టర్ మాస్టర్ జనరల్(QMG) అయిన లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రెహమాన్ కొన్ని రోజులుగా ఇందుకు కుట్ర పన్నుతున్నారనే వార్తలు వచ్చిన తర్వాత అతడిపై బంగ్లాదేశ్ ఆర్మీ నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆమోదించినట్లు తెలుస్తోంది.
Tariff Cuts: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘‘పరస్పర సుంకాలు’’, సుంకాల పెంపుపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. ఇండియాపై కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. అయితే, ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తన సుంకాలను చాలా వరకు తగ్గించుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజలు తర్వాత, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించడానికి కట్టుబడి లేమని భారత్ చెబుతోంది.
Turkey: టర్కీ తన బైరెక్టర్ డ్రోన్లతో భారత్‌ని చికాకు పెడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో సంబంధాలు బలపరుచుకున్న టర్కీ, ఈ దేశాలకు తన డ్రోన్లు అందించింది. అయితే, ఇప్పుడు ఈ డ్రోన్లను తయారు చేసిన బైకర్ కంపెనీ, మొట్టమొదటి మానవరహిత ఫైటర్ జెట్ కిజిలెల్మాతో సిద్ధమైంది. టర్కీ తన తొలి మానవరహిత యుద్ధవిమానం, కిజిలెల్మాని తయారు చేసింది. పూర్తిగా టర్కీ తన స్వదేశీ టెక్నాలజీతో దీనిని రూపొందించింది. దీని టెస్ట్ షెడ్యూల్లో భాగంగా, ఏరోడైనమిక్ సిస్టమ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్‌ని […]
CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్‌కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు.
Instagram reels: కొందరు రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోంది. సోషల్ మీడియాలో వీడియోల వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఇతరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వదిన, మరిది రీల్స్ పిచ్చి ఏకంగా 8 ఫ్లాట్లను దగ్ధం చేసింది. వీరిద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘లవ్ జిహాద్’’ చట్టం అవసరాన్ని చెప్పారు. దాదాపు లక్ష కేసులు ఈ విధంగా నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను మొదట్లో మతాంతర వివాహాలుగా చూసినప్పటికీ, పురుషులు వివాహానికి ముందు తమ గుర్తింపుని దాచిపెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత తమ భార్యలను విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ స్త్రీలలో చాలా మందిని వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నాయని, వారి జీవితాలు విధుల పాలవుతున్నాయని చెప్పారు.
HCL: HCL వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోష్ని నాడార్ మల్హోత్రాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యూహాత్మక వారసత్వ ప్రణాళికలో భాగంగా, HCL గ్రూప్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, గ్రూప్ ప్రమోటర్ సంస్థలు అయిన HCL కార్ప్, వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (వామ ఢిల్లీ)లో తన వాటాలో 47% తన కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రాకు బహుమతిగా ఇచ్చారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితా 2025 ప్రకారం.. శివ్ నాడార్ నికర విలువ […]
Australia: నకిలీ ఉద్యోగాల పేరుతో మహిళల్ని మోసం చేసి, వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని దారుణంగా అత్యాచారాలకు పాల్పడిన భారత సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది, నిందితుడికి 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్ లేకుండా శిక్షను ప్రకటించింది. 43 ఏళ్ల బాలేష్ ధంఖర్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శిక్ష విధించేటప్పుడు బాలేష్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అతను ముందుగానే […]
PM Modi: ఛాతి నొప్పితో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ పరామర్శించారు. ధంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ఎయిమ్స్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ జీ ఆరోగ్యం గురించి ఆరా తీశాను.