Thar: నోయిడాలో బిజీ రోడ్డుపై మహీంద్రా థార్ SUV భీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తి రాంగ్ రూట్లో కారుని వేగంగా నడుపుతూ, అనేక ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. తృటిలో పాదచారులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెక్టార్ 16లోని కార్ల మార్కెట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఈ సంఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. మోర్నా గ్రామానికి చెందిన సచిన్ అనే వ్యక్త థార్ కారున కొని, అందులో స్పీకర్లు […]
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. ప్రతిపక్ష బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, సభను వాయిదా వేయాలనే ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేస్తూ, పత్రాలను చింపేశారు. బీజేపీ సభ్యులకు ఎలాంటి పత్రాలు అందించొద్దని స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ కార్యదర్శిని ఆదేశించారు.
Holi: హోలీ పండగ దగ్గర పడటంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు ఉండటంతో ముఖ్యం మతపరంగా సున్నితంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. గత నవంబర్‌లో యూపీలో సంభాల్ అల్లర్లకు కారణమైన జామా మసీదులో పాటు మరో 10 మసీదులను ముసుగులతో కప్పనున్నారు.
Starlink: ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో రిలయన్స్ గ్రూప్‌కి చెంది జియో జట్టు కట్టింది. ఇప్పటికే, ఎయిర్టెల్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలోని రెండు టెలికాం దిగ్గజాలు స్పేస్ ఎక్స్‌తో భాగస్వామ్యం కాబోతోన్నాయి.
Yogi Adityanath: హిమాలయ దేశం నేపాల్‌లో రాజరిక పాలన కోసం ప్రజలు గళమెత్తుతున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర కోసం ప్రజలు ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. నేపాల్‌లో ప్రజాస్వామ్యం వద్దని, మళ్లీ రాజరికం కావాలని కోరడం సంచలనంగా మారింది. అయితే, మార్చి 10న రాజు జ్ఞానేంద్రకు అనుకూలంగా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జ్ఞానేంద్రతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Balochistan: పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే ‘‘మహ్మద్ అలీ జిన్నా’’ బలూచిస్తాన్‌కి చేసిన నమ్మక ద్రోహం కారణంగా ఆ ప్రాంతం కొన్ని దశాబ్ధాల కాలంగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ ప్రజలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం సైన్యం సాయంతో, కుట్రల సాయంతో ఈ తిరుగుబాటుని అణచివేస్తూనే ఉంది. తాజాగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ రైల్వేకి చెందిన జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేయడం సంచలనంగా మారింది. 400 మందికి పైగా ప్రయాణికుల్ని…
Haryana: కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్‌తక్‌తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్జిత్ యాదవ మానేసర్ని గెలుచుకున్నారు.
Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సంచలన చర్యకు పాల్పడింది. బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. దాదాపుగా 500 మందితో ప్రయాణిస్తున్న రైలును బలూచ్ వేర్పాటువాదులు తమ అదుపులోకి తీసుకున్నారు.
Pakistan: పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్‌కి గురైంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ రైల్వేకి చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేశారు. ఈ రైలు బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రైన్‌పై దాడి చేసిన బీఎల్ఏ 450 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించారు. మరోవైపు అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించే, దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా కెనడాపై మరోసారి టారిఫ్స్‌తో విరుచుకుపడింది.