Turkey: టర్కీ తన బైరెక్టర్ డ్రోన్లతో భారత్‌ని చికాకు పెడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో సంబంధాలు బలపరుచుకున్న టర్కీ, ఈ దేశాలకు తన డ్రోన్లు అందించింది. అయితే, ఇప్పుడు ఈ డ్రోన్లను తయారు చేసిన బైకర్ కంపెనీ, మొట్టమొదటి మానవరహిత ఫైటర్ జెట్ కిజిలెల్మాతో సిద్ధమైంది. టర్కీ తన తొలి మానవరహిత యుద్ధవిమానం, కిజిలెల్మాని తయారు చేసింది. పూర్తిగా టర్కీ తన స్వదేశీ టెక్నాలజీతో దీనిని రూపొందించింది. దీని టెస్ట్ షెడ్యూల్‌లో భాగంగా, ఏరోడైనమిక్ సిస్టమ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
టర్కీ నుంచి బైరెక్టర్ డ్రోన్లను పాకిస్తాన్, బంగ్లాదేశ్ కొనుగోలు చేశాయి. బంగ్లాదేశ్ వీటిని భారత సరిహద్దుల్లో మోహరించాయి. ఈ పరిణామం భారత్‌కి వ్యూహాత్మక ఇబ్బందుల్ని కలిగిస్తుంది. టర్కీకి భారత వ్యతిరేక దేశాలతో మంచి సంబంధాలు ఉండటంతో, భారత్ కూడా తన డ్రోన్ విమానాలను సిద్ధం చేసుకుంటుంది.
Read Also: Health Tips: రక్తహీనతతో బాధపడుతున్నారా? ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోండి
తాజాగా, టర్కీ మానవరహిత విమానంలో ఏమియానిక్స్‌ని మెరుగుపరిచింది. దీని శక్తివంతమైన కొత్త ఇంజన్, ఈ విమానాన్ని ధ్వని వేగాన్ని చేరుకోవడానికి, అధిక వేగంతో మెరుగైన విన్యాసాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనిలో AESA రాడార్ అమర్చారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మద్దతు కూడా ఉంది. ఇది అటానామస్‌గా టేకాఫ్,ల్యాండింగ్ చేసుకోగలదు. దీని స్టెల్త్ డిజైన్, రాడాన్ నుంచి తప్పించుకునేలా చేస్తుంది.
2023లో బైకర్ తన ఎగుమతుల ద్వారా 1.8 బిలియన్ డాలర్లను సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద UAV ఎగుమతిదారుగా ఉంది. ఈ సంస్థ ఆదాయంలో దాదాపుగా 90 శాతం ఎగుమతుల ద్వారానే వచ్చాయి. బైరెక్టర్ TB2 UCAV డ్రోన్ల కోసం 34 దేశాలతో, బైరెక్టర్ అకిన్సి ఉకావ్ డ్రోన్ల కోసం 11 దేశాలు బైకర్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో బైకర్ లియోనార్డోతో వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చర్య యూరోపియన్ మార్కెట్‌లోకి విస్తరించేందుకు సహకరించగలదు.