Mahindra XUV 3XO: దేశీయ ఆటో మేకర్ మహీంద్రా కార్లు కొనాలంటే సంవత్సరాలు ఆగాల్సిందే అనే భయం కస్టమర్లలో ఉంది. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ‘‘వెయిటింగ్ పీరియడ్’’ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మహీంద్రా XUV 3XO కొనే వారికి గుడ్ న్యూస్, ఈ ఎస్యూవీ కోసం వేచి చూసే సమయం తగ్గింది. XUV 3XO 2024లో మార్కెట్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది.
Annamalai: తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఇప్పటికే జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై వివాదం నడుస్తోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ రుద్దే ప్రయత్నం చేస్తో్ందని సీఎం స్టాలిన్‌తో సహా డీఎంకే పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి గుర్తుకు బదులుగా తమిళ అక్షరం ‘‘రూ’’ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.
SpaDeX mission: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో ఘటన సాధించింది. స్పాడెక్స్ ఉపగ్రహాలను డీ-డాకింగ్ చేయడంలో విజయం సాధించింది. డీ-డాకింగ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్ మిషన్లలో ముఖ్యంగా చంద్రుడిపై అన్వేషించడం, మానవ సహిత అంతరిక్ష యానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి మిషన్లకు మార్గం సుగమం అయినట్లు ఇస్రో మంగళవారం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ఉపగ్రహాలు విజయవంతంగా డీ-డాక్ చేయడాన్ని ప్రకటించారు.
Blackmail: గుజరాత్ బనస్కాంత జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి కాలేజీ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. Read Also: Off The Record: మింగలేక-కక్కలేక అన్నట్టుగా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి? 2023లో పాలన్‌పూర్‌లోని ఒక కళాశాలలో చేరడం ప్రారంభించిన నెలల తర్వాత ఆరుగురు నిందితుల్లో ఒకరు, 20 […]
Pak train hijack: పాకిస్తాన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ని హైజాక్ చేశారు. ట్రైన్లో మొత్తం 400+ ప్రయాణికులు ఉంటే, 200 మందిని బీఎల్ఏ బందీలుగా చేసుకుంది.
Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో రైలు హైజాక్ జరిగిన ఘటన యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ఫైటర్స్ ఈ హైజాక్‌కి పాల్పడ్డారు. మంగళవారం బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జఫర్ ఎక్స్‌ప్రెస్’’ని మారుమూల సిబి జిల్లాలో బీఎల్ఏ అదుపులోకి తీసుకుంది. ట్రైన్ ట్రాక్‌ని పేల్చేసిన బీఎల్ఏ 400 మంది ప్రయాణికులను బందీలుగా చేసుకుంది. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ […]
UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
Bhupathi Raju Srinivasa Varma: కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి సాయంత్రం తన మంత్రిత్వ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి ప్రయాణిస్తున్న కారును మరో ప్రభుత్వ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. కారు ఇంజన్ సీజ్ అయినట్లు తెలుస్తోంది.
Ranya Rao Case: రన్యా రావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా సుపరిచితమైన రన్యా రావు, బంగారం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ బార్స్‌ని నడుముకు చట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గతంలో చాలా సార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ రామచంద్రరావు సవతి కూతురు కావడంతో ఈ…
అయితే, తాజాగా ఎంఐఎం నేత ఇమ్రాన్ సోలంకి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోల్‌కతాలోని క్రికెట్ స్టేడియం ‘‘ఈడెన్ గార్డెన్’’ కూడా వక్ఫ్ ఆస్తి అని క్లెయిమ్ చేశారు. భారత సైన్య తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫోర్ట్ విలియ కూడా వక్ఫ్ ఆస్తి అని పేర్కొన్నారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో వక్ఫ్‌కు 105 ఆస్తులు ఉన్నట్లు ఇమ్రాన్ చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.