Pak train hijack: పాకిస్తాన్ రైలు హైజాక్.. 150 మంది సైనికులు ఊచకోత..?
- నరమేధం సృష్టించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ..
- 150 మంది పాక్ సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ ప్రకటన..
- తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుంది: బీఎల్ఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సంచలన చర్యకు పాల్పడింది. బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. దాదాపుగా 500 మందితో ప్రయాణిస్తున్న రైలును బలూచ్ వేర్పాటువాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తామే అని బీఎల్ఏ ప్రకటించుకుంది. బీఎల్‌ఏ ఆత్మాహుతి దళం మాజిద్ బ్రిగేడ్ ఈ హైజాక్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది.
Read Also: Pakistan: బలూచ్ ఆర్మీ, పాకిస్తాన్ రైలుని ఎలా హైజాక్ చేసింది..?
Also Read
- New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
- Pickaxe Mountain: 'త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం' ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
ఈ ఘటనలో ఇప్పటి వరకు 150 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించారని తెలుస్తోంది. సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామలు ఉంటాయిన బీఎల్ ఇప్పటికే హెచ్చరించింది. బలూచిస్తాన్ కార్యకర్త మామా ఖదీర్ బలోచ్ మాట్లాడుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది సైనిక సిబ్బంది ఈ ఆపరేషన్ సమయంలో హతమైనట్లు చెప్పారు. ఇంకా తమ వద్ద 182 మందిని బందీలుగా ఉన్నారని బీఎల్ఏ ప్రకటించింది.. పర్వత ప్రాంతాల గుండా వెళ్తున్న రైలు పట్టాలను పేల్చేసి, రైలును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, బలూచ్ ప్రభుత్వం, పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు బందీలు, ప్రాణ నష్టం గురించి చెప్పలేదు. పాకిస్తాన్ బలగాలు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాయి. ఇప్పటికే బీఎల్ఏ, పాక్ ఆర్మీ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రైల్వే అధికారుల ప్రకారం.. రైలులోని 9 కోచ్‌లలోని 450 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎలాంటి కాంటాక్ట్ లేదని తెలుస్తోంది. మరోవైపు పాక్ దళాలు ఏదైనా ఆపరేషన్ నిర్వహిస్తే బందీలను దారుణంగా చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రయాణికులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రయాణికుల్ని బీఎల్ఏ వదిలేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబ్ ప్రాంత ప్రయాణికులను బందీలుగా తీసుకుంది.
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!