Thar: నోయిడాలో బిజీ రోడ్డుపై మహీంద్రా థార్ SUV భీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తి రాంగ్ రూట్‌లో కారుని వేగంగా నడుపుతూ, అనేక ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. తృటిలో పాదచారులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెక్టార్ 16లోని కార్ల మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఈ సంఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. మోర్నా గ్రామానికి చెందిన సచిన్ అనే వ్యక్త థార్ కారున కొని, అందులో స్పీకర్లు అమర్చడానికి మార్కెట్‌కి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Jethwani Case: నటి జత్వానీ కేసులో ఆ ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగింపు..
రోడ్డుపై జనం గుమిగూడి ఉన్న సమయంలోనే సచిన్ థార్‌ని రాంగ్ రూట్‌లో వారిపైకి నడిపాడు. ఇతర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వైరల్ వీడియోను గుర్తించిన పోలీసులు దీనిపై ఫిర్యాదు అందుకున్నారు. సచిన్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సచిన్ ఇటీవల ఢిల్లీలోని ఒక వ్యక్తి నుంచి కారు కొనుగోలు చేశాడు. అతడి పేరు పైకి ఇంకా కారు మారలేదు.
A desert is barren by nature; these assholes by choice. The drivers of the Thar are the Great Indian Desert on wheels. Their brains a brutal, lawless emptiness, devoid of manners and respect for rules or people pic.twitter.com/pAYnBMB5Z8
— ᴋᴀᴍʟᴇsʜ sɪɴɢʜ / tau (@kamleshksingh) March 12, 2025