Tata Tiago NRG: సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నారా.. అయితే, వచ్చేస్తోంది సరికొత్త టియాగో NRG
- సరికొత్తగా రాబోతున్న టాటా టియాగో NRG..
- ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో మార్పులు..
- 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, రెయిర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Tiago NRG: సేఫ్టీ కార్‌ల విషయంలో టాటాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాటా నుంచి వచ్చే కార్లు దాదాపుగా గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సేఫ్టీని సాధిస్తుంటాయి. టాటా హ్యాక్ బ్యాక్ కార్లు కూడా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. సేఫ్టీ హ్యాచ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా టియాగో NRG-2025 మార్కెట్‌లోకి రాబోతోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు SUV లాంటి స్టైలింగ్ లక్షణాలతో హ్యాచ్‌బ్యాక్ పొందాలనుకునే కస్టమర్ల కోసం టాటా టియాగో NRGని రూపొందించింది. అయితే, ఇప్పుడు ఈ కార్ మరింత అప్‌డేట్స్‌తో వస్తోంది.
టాటా టియాగో NRG: ఇంజిన్ అండ్ పవర్‌ట్రెయిన్ వివరాలు
Also Read
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్‌లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
టాటా టియాగో NRG 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీంట్లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్(AMT) రెండూ ఉండొచ్చు. ఇంజన్ 82 HP మాగ్జిమమ్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు కావాలంటే మాన్యువల్ లేదా AMT ఛాయిస్‌లతో CNG వేరియంట్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది 73 HP గరిష్ట శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది.
టాటా టియాగో NRG: ఎక్స్‌టీరియర్ వివరాలు
2025 మోడల్ టియాగో NRG ఫ్రంట్, వెనక బంపర్‌లను రీడిజైన్ చేయబడిని సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, LED హెడ్‌లైట్లు, రీ డిజైన్డ్ వీల్ కవర్స్ కలిగి ఉంటుంది. టెయిల్ గేట్ వద్ద NRG బ్యాడ్జ్, చంకీ బ్లాక్ రూఫ్ రెయిల్స్, రెండు వైపులా ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ వంటి ఎక్స్‌టీరియర్స్ కలిగి ఉంది.
మరింత స్టైలిష్‌గా ఇంటీరియర్
టాటా టియాగో NRGలో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్ట్ కలిగిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. ఆటో హెడ్‌లైట్లు, వైపర్‌లు, రెయిర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రత విషయాని వస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 3-పాయింట్ ELR సీట్ బెల్టులు, ఐసో ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, కారు వెనక భాగంలో పార్కింగ్ సెన్సార్లు, మాన్యువల్ HVAC ఉంటాయి.
ధర రూ. 7.2 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఇది భారత మార్కెట్‌లో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!