Pakistan train hijack: పాక్ ట్రైన్ హైజాక్.. “బలూచ్ లిబరేషన్ ఆర్మీ” ఏం సాధించింది..?
- పాక్ ట్రైన్ హైజాక్‌పై అంతర్జాతీయ దృష్టి..
- బీఎల్ఏ, బలూచ్ వివాదంపై ఇంటర్నేషనల్ మీడియా కథనాలు..
- పాక్, చైనా దోపిడి బహిర్గతం..
- అంతర్జాతీయ సమాజం ముందు బలూచ్ ప్రజల అణచివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan train hijack: పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మనం చాలా సార్లు విమానాలు, ఓడలు, బస్సులు హైజాక్ కావడాన్ని చూశాం. అయితే, రైలును హైజాక్ చేయడం అనేది చాలా కఠినం, అలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ వెళ్తున్న రైలును హైజాక్ చేశారు. ముఖ్యంగా, పర్వతాలు, టన్నెల్స్ నుంచి వెళ్లే మార్గంలో, మారుమూల ప్రాంతాన్ని ఎంచుకుని పక్కా ప్లాన్‌లో హైజాక్ చేశారు. 400 మంది కన్నా ఎక్కువ ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకున్నారు. బందీలను విడిపించేందు పాక్ ఆర్మీ దాదాపుగా 36 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. మొత్తం, ప్రయాణికుల్ని విడిపించామని, 30 కన్నా ఎక్కువ మంది మిలిటెంట్లను చంపేశామని పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు, బీఎల్ఏ ఇందుకు విరుద్ధంగా 100 మందికి పైగా పాక్ ఆర్మీ సిబ్బందిని చంపేసినట్లు పేర్కొంటోంది.
ప్రపంచానికి తెలిసేలా చేసింది..
Also Read
- Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
- UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
- Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
- Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
పాకిస్తాన్ తమ ప్రాంతానికి చేస్తున్న అన్యాయాన్ని, తమ హక్కులను కాలరాస్తున్న విధానాన్ని బీఎల్ఏ ప్రపంచం ముందుంచాలని ఈ హైజాక్ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైలు హైజాక్ అయిన అంశం అంతర్జాతీయంగా మీడియాలో ప్రముఖంగా నిలిచింది. దీంతో అసలు, ఈ బలూచిస్తాన్ మూమెంట్ ఏమిటి..? వీరు ఎందుకు దాడులు చేస్తున్నారనే అంశాలపై ఇంటర్నేషనల్ మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, బలూచిస్తాన్ వివాదాన్ని బీఎల్ఏ అంతర్జాతీయ సమాజం ముందు ఉంచింది.
ఇదే సమయంలో తాము ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోలిస్తే చాలా భిన్నమనే విషయాన్ని కూడా వెల్లడించింది. ట్రైన్ హైజాక్ తర్వాత మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను విడిచిపెట్టి, తాము వారికి చాలా భిన్నమనే విషయాన్ని వెల్లడించింది. కేవలం పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందితో పాటు తమ వనరుల్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ప్రజలను మాత్రమే బందీలుగా చేసుకుంది.
పాక్ నిఘా వైఫల్యం, ఆర్మీ బలాలు బట్టబయలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీల్లో ఒకటి, అణ్వాయుధ సత్తా ఉందని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్‌కి బీఎల్ఏ సవాల్ విసిరింది. మేము తలుచుకుంటే పాక్ ఆర్మీని కూడా దెబ్బతీయగలమనే సందేశాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్మీలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా పాక్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ డామినేషన్ ఉంటుంది. మిగతా ప్రాంతాల వారికి సరైన ప్రాతినిధ్యం ఉండదు. అందుకే బీఎల్ఏ పంజాబ్ ప్రజల్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వారంతా బలూచిస్తాన్‌లో పనిచేయాలంటే భయపడేలా చేసింది.
పాక్ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐఎస్ఐ వంటి సుశిక్షిత గూఢచార సంస్థ ఉన్నప్పటికీ, బీఎల్ఏ ముందు వారి పప్పులు ఉడకలేదు. ట్రైన్ హైజాక్ అయిన దాదాపుగా 36 గంటల తర్వాత మాత్రమే రెస్క్యూ విజయవంతమైందని స్వయంగా పాక్ ఆర్మీ ప్రకటించింది. దీనిని బట్టి చూస్తే దాని బలహీనతల్ని బీఎల్ఏ ఎత్తిచూపింది.
చైనా, పాకిస్తాన్ బహిర్గతం..
1948 నుంచి తమ ప్రాంతం ఎలా అణచివేతకు గురవుతుంది, తమ ప్రాంత ప్రజలపై పాకిస్తాన్ చేస్తున్న అకృత్యాలను బీఎల్ఏ ఈ హైజాక్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. పాక్ ఆప్తమిత్రుడు చైనాను కూడా ప్రపంచం ముందు నిలబెట్టింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సహాజవాయువు, విలువైన ఖనిజ సంపదనను పాక్, చైనాలు కలిసి దోచుకుంటున్నాయనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు బీఎల్ఏ ఉంచింది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్ట్, చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ద్వారా సంపదను దోచుకుంటున్నాయనే వాదనను బీఎల్ఏ ముందుకు తెచ్చింది. బీఎల్ఏ ఫైటర్స్ ఒక వీడియో మెసేజ్‌లో పాకిస్తాన్, చైనాలు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇవ్వడం వైరల్ అయింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!