Tech Mahindra: ఖతార్‌లో గుజరాత్‌కి చెందిన భారతీయ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్ట్ రెండు దేశాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ అరెస్ట్ క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డేటా చౌర్యం కేసులో ఈ అరెస్ట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. టెక్ మహీంద్రా ఖతార్ విభాగానికి అమిత్ గుప్తా సీనియర్ ఉద్యోగిగా ఉన్నారు. ప్రస్తుతం టెక్ మహీంద్రా రీజినల్ హెడ్-ఖతార్, కువైట్‌గా గుప్తా పనిచేస్తున్నారు. ఖతార్ పోలీసులు ఈ ఏడాది జనవరి 1న అమిత్ గుప్తాని అరెస్ట్ చేసినట్లు అతడి తల్లి పుష్ప గుప్తా చెబుతున్నారు. ఈ అరెస్ట్ విషయంలో తమను ఆదుకోవాలని ప్రధాని మంత్రి నరేంద్రమోడీని అమిత్ గుప్తా కుటుంబం కోరింది.
Read Also: Kishan Reddy : డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం బహిర్గతం
ఈ అరెస్ట్‌పై టెక్ మహీంద్రా కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగి కుటుంబంతో టచ్‌లో ఉన్నట్లు ఆదివారం చెప్పింది. ‘‘మేము కుటుంబంతో సన్నిహితంగా ఉంటాము, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తాము. మేము రెండు దేశాలలోని అధికారులతో చురుకుగా సమన్వయం చేసుకుంటున్నాము. తగిన ప్రక్రియకు కట్టుబడి ఉన్నాము. మా సహోద్యోగి శ్రేయస్సును నిర్ధారించడం మా ప్రధానం’’ అని టెక్ మహీంద్ర ప్రతినిధి చెప్పారు. డేటా దొంగిలించినందుకు అమిత్ గుప్తాని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, అతడి కుటుంబం మాత్రం అతడు నిర్దోషి అని చెబుతున్నారు.
‘‘జనవరి 1న అమిత్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. 48 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా ఉంచారు. ఆ తర్వాత అతడిని ఒక గదిలో బంధించారు. మూడు నెలలుగా దోహాలోనే ఉంచారు. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు’’ అని అమిత్ గుప్తా తల్లి పుష్ప గుప్తా చెప్పారు. కంపెనీలో ఎవరో ఏదో తప్పు చేసి ఉండొచ్చు, అతను కంపెనీ మేనేజర్ కాబట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు అని ఆమె చెప్పింది.