BJP: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కొత్త చీఫ్ రాబోతున్నారు. ఏప్రిల్ మూడో వారం నాటికి బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 4న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఊపందుకుంటుందని తెలుస్తోంది.
Read Also: Kesineni Nani: వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదు..
ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి, వాటికి రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మిగిలిన 19 రాష్ట్రాలకు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించిన తర్వాత, పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించే ముందు, సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని బీజేపీ రాజ్యాంగం సూచిస్తుంది. 2019 నుంచి ఈ జేపీ నడ్డా అధ్యక్ష పదవిలో ఉన్నారు. నిజానికి బీజేపీ చీఫ్ పదవి 3 ఏళ్లు. అయితే, 2024 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడగించుకుంటూ వచ్చారు.