Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్ […]
Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేపట్టిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ వ్యాప్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ త్రివిధ దళాల నేతృత్వంలో ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో దాడులు జరిగాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌కి బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసింది. మంగళవారం, సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పరోక్షంగా పాకిస్తాన్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇకపై భారతదేశ నీరు భారత్ కోసమే ప్రవహిస్తుంది. భారతదేశం కోసమే ఆగిపోతుంది, భారతదేశానికి మాత్రమే ఉపయోగిపడుతుంది’’ అని అన్నారు. ‘‘ఈరోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో, భారతదేశ హక్కుగా […]
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు.
Bilawal Bhutto: ‘‘సింధు నది జలాల’’ను నిలిపేస్తే అందులో భారతీయులు రక్తం పారుతుందని హెచ్చరించిన బిలావల్ భుట్టో జర్దారీ, నేడు శాంతి వచనాలు వల్లిస్తున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. ఈ దాడి వెనక పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉంది.
India Pakistan: 26 మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Sindhu river: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని చనిపోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్‌ని తన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా, ‘‘సింధు నది జలాల’’ ఒప్పందం నిలిపేసింది. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం దాయాది దేశంలో భయాన్ని పుట్టిస్తోంది. సింధు దాని ఉపనదులు పాకిస్తాన్ 80 శాతం ప్రజలకు జీవనాధారం. ఇప్పుడు, ఇండస్ వాటర్ ట్రిటీని నిలిపేయడంతో పాకిస్తాన్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
Pakistan: ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యవాసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నా, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు.