Blackout Drill: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ఆర్మీ కంటోన్మెంట్లో ఆదివారం రాత్రి ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’ నిర్వహించారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి, ఎలాంటి వెలుతురు లేకుండా సైన్యం ఈ వ్యాయామంలో పాల్గొంది. తన యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంది. బ్లాక్అవుట్ డ్రిల్ సక్సెస్ కావడానికి ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషన్ మద్దతు, సహకారాన్ని కోరారు. డ్రిల్ […]
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మాత్రం మేము భారత్‌ని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఎంత గంభీరంగా బయటకి కనిపిస్తున్నా, పాక్ నాయకత్వంలో భారత్ అంటే భయం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి సంక్షోభ ప్రాంతాల నుంచి […]
Rajnath Singh: 26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్ మినిస్టర్స్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు…
Murshidabad riots: గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల వల్ల వందలాది హిందూ కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అల్లర్లపై బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీలు సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
Milind Deora: పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ఉంటే, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబంతో యూరప్‌లో సెలవులు గడిపేందుకు వెళ్లారని శివసేన నేత మిలింద్ దేవరా ఘాటు విమర్శలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే యూరప్‌లో హాలీడేస్ గడుపుతున్నారని మండిపడ్డారు.
Viral Video: హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, ఈ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భయంతో పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ దేశం విడిచి పారిపోయేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆరోపించారు.
CRPF Man: పాకిస్తాన్ మహిళతో తన వివాహాన్ని దాచిపెట్టడం, వీసా ముగిసినా కూడా ఆశ్రయం కల్పించిన కారణంగా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మునీర్ అహ్మద్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం నుంచి తీసేస్తూ నిన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉత్తర్వులు జారీ చేసింది.
Pakistani YouTuber: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఒక వర్గం భారత్‌ని నాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ ప్రభుత్వంలోని మంత్రులతో పాటు రాజకీయ నాయకులు అర్థపర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాపంగండా కథనాలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు చెందిన ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.