Venu Goapl Reddy
Author- NTV Telugu-
BJP: కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’.. అన్సారీ ‘‘గజినీ’’ కామెంట్స్‌పై బీజేపీ..
BJP: కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు. చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో […] -
T20 World Cup 2026: “పాకిస్తాన్ ఆడకుంటే, మేం ఆడుతాం”.. ICCని కోరిన మరో దేశం..
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా.? లేదా? అనే విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. భద్రతా సాకులు చూపుతూ, అనవసర రాద్ధాంతం చేసిన బంగ్లాదేశ్, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. -
Bengaluru: “డాగ్ లవర్స్” దీనికేం సమాధానం చెబుతారు.. కుక్క దాడితో మహిళకు 50 కుట్లు..
Bengaluru: జంతు ప్రేమికులు ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తున్న మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి దారుణంగా గాయపరిచింది. ఈ ఘటన బెంగళూర్‌లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో జనవరి 26న ఈ ఘటన జరగింది. ఉదయం 6.54 గంటల ప్రాంతంలో టీచర్స్ కాలనీలో, బాధితురాలి ఇంటి ముందే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. -
Volkswagen Tera: “పోలో” వారసుడిగా వోక్స్ వ్యాగన్ టెరా..!
Volkswagen Tera: వోక్స్ వ్యాగన్ పోలో( Volkswagen Polo ) భారత మార్కెట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసేలా మరో కారును తీసుకురాలేదు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పోలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఫీచర్లు మాత్రమే కాదు, దాని స్టెబిలిటీ, రైడింగ్ ఫీల్ మరే కారులో కనిపించేది కాదని చెబితే అతిశయోక్తి కాదు. చాలా మంది కార్ ప్రేమికులకు ‘‘ఫోలో’’ ఒక భావోద్వేగం. యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ అంటే ఏమిటో భారత్‌కు చూపించింది. -
Pakistan PM: పరువు తీసుకోవడమే పాక్ ప్రధాని పని.. ఈసారి ఏం చేశాడంటే..
Pakistan PM: పాకిస్తాన్ రాజకీయ నాయకులు పరువు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా, ఆయన ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపుపై సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు పాక్ పీఎంను ఒక ఆట ఆడుకుంటున్నారు. మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా షరీఫ్ పోస్ట్‌పై సెటైర్లు వేశారు. ‘‘ఆస్ట్రేలియా -బీ టీమ్’’పై గెలవడంలో గొప్పేంటి అని ప్రశ్నించారు. -
Amit Shah: ‘‘గమోసా వివాదం’’.. రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్…
Amit Shah: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహూకరించిన గమోసాను ధరించడాని నిరాకరిచడం ద్వారా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అస్సామీ వస్త్ర సంప్రదాయాన్ని అగౌరపరిచారని హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఆరోపించారు. రాహుల్ గాంధీ తనకు నచ్చింది చేసుకోవచ్చు, కానీ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ఏ మాత్రం అగౌరవపరిచినా సహించమని హెచ్చరించారు. -
Dhurandhar: ఓటీటీలోకి ధురంధర్, నెట్‌ఫ్లిక్స్ తీరుపై ఆగ్రహం.. కారణాలేంటి..?
Dhurandhar: ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి చూసిన తరుణం వచ్చింది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘‘ధురందర్ ’’ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ఓటీటీలో కనిపిస్తోంది. -
NCP Reunion: అజిత్ పవార్ మరణం..ఎన్సీపీ కలయిక.. కీలకంగా సునేత్ర పవార్..
NCP Reunion: అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే, ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రెండు వర్గాలు తిరిగి కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ (అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాలు కలిసి పనిచేశాయి. ఇప్పుడు, అజిత్ పవార్ మరణంతో ఫిబ్రవరిలో రెండు కలిసే అవకాశం ఉందని ఆయా వర్గాలు వెల్లడించాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బాబాయ్, అబ్బాయ్‌లు ఎన్సీపీ కలయికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈలోపే బారామతి విమాన ప్రమాదంలో అజిత్… -
Mood of the Nation Survey 2026: తృణమూల్ – బీజేపీ: ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే గెలుపెవరిది..
Mood of the Nation Survey 2026: దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతగా 287 సీట్లను సాధించి అధికారంలోకి వస్తుందని, ఎన్డీయే కూటమి 350కిపైగా స్థానాలు సాధిస్తుందని ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1.25 లక్షల కంటే ఎక్కువ మంది అభిప్రాయాలతో ఈ సర్వే చేసింది. -
Mahindra BE 6: మంటల్లో కాలిన మహీంద్రా BE 6 కార్.. అసలు కారణం ఇదే..
Mahindra BE 6: మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని గులాతి సమీపంలో మంటల్లో కాలిపోయింది. మహీంద్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు మంటల్లో చిక్కుకోవడం అందర్ని ఆశ్చర్యపరించింది. అసలు కారణాలు ఏంటనే దానిపై తాజాగా మహీంద్రా వివరాలు వెల్లడించింది. వాహనంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి గాయాలు కాలేదని కంపెనీ చెప్పింది.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!