Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kaali Poster Row: ‘కాళి’ వివాదాస్పద చిత్రంపై టొరంటో అగాఖాన్ మ్యూజియం తీవ్ర విచారం
కాళి అమ్మవారిని సిగరేట్ తాగుతూ చూపించడాన్ని హిందు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో టోరంటోలోని అగాఖాన్ మ్యాజియం హిందువుల మత విశ్వాసాలను కించపరిచేందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒట్టావాలోని భారత మిషన్, కెనడాలోని అధికారులు వివాదస్పద చిత్రాన్ని తొలిగించాలని కోరడంతో ‘ కాళి’ డాక్యుమెంటరీ ప్రదర్శనను తీసివేసినట్లు తెలిపింది. టొరంటోకు చెందిన చిత్రనిర్మాత మణిమేకలై శనివారం ‘ కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ ను ట్విట్టర్ లో పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇందులో కాళి అవతారంలో ఉన్న […] -
Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన రెండు మామిడి చెట్లకు ముగ్గురు గార్డులను, 6 వాచ్డాగ్లను సెక్యురిటీగా పెట్టాడు. మీరు వింటున్నది నిజమే.. మామిడి చెట్లకు అది కూడా రెండింటికి ఇంత సెక్యురిటీ ఎందుకా.. అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఇది అలాంటి ఇలాంటి మామిడి చెట్లు కావు. అరుదైన, అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి చెట్లు. మియాజాకి మామిడి పండ్ల ధర కేజీకి రూ. 2.7 లక్షలు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రైతు తన […] -
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాత్రి నుంచి కురిసే అవకాశం
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలో విస్తరించడంతో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 4న రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంచిర్యాల, జగిత్యాల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు […] -
Moto G42: ఇండియాలో మోటో జీ 42 లాంచ్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే
మోటోరొలా నుంచి మోటో జీ 42 మొమైల్ సోమవారం ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మోటో జీ42 పోటీ ఇవ్వనుంది. గతేడాది యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయినా ఇండియాలో ఏడాది తరువాత లాంచ్ చేశారు. మోటో జీ42 20:9 ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ను కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా […] -
Bihar: కూతురును చంపించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్లాన్.. కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం
బీహార్ లో పరువు హత్యకు స్కెచ్ వేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురునే హతమార్చేందుకు ప్రయత్నించాడు. తన కూతురును చంపేలా కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తి అయి ఉండీ..పరువు హత్యకు ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసుల ముందు గుట్టు విప్పడంతో సదరు ఎమ్మెల్యే క్రిమినల్ చర్య గురించి తెలిసింది. […] -
Maharashtra Political Crisis: బలపరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే.. ఉద్ధవ్ వర్గం నుంచి పెరిగిన సపోర్ట్
మహారాష్ట్ర సంక్షోభం దాదాపుగా ముగిసింది. తాజాగా ఈ రోజు జరిగిన బలనిరూపనలో సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకున్నారు. దీంతో బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మహారాష్ట్రను మరో రెండున్నరేళ్ల పాటు పాలించనుంది. విశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహాారాష్ట్రలో 144 మెజారిటీ కావాలి. అయితే దీని కన్నా 20 మంది సపోర్ట్ షిండే వర్గం సాధించింది. షిండే […] -
Delhi: తనపై మొరిగిందని కుక్కతో సహా ముగ్గురిపై దాడి
పక్కింటి వారి కుక్క తనపై మొరిగిందనే కోపంతో కుక్కతో, ముగ్గురిపై దాడి చేసిన ఘటన ఢిల్లీలోని పశ్ఛిమ విహార్ లో చోటు చేసుకుంది. ఇనుప రాడ్ తో కుటుంబంలోని ముగ్గురి వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా కుక్కను కూడా కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. Read Also:Government of Tamil Nadu: కమల్ కు నోటీసులు.. ఎందుకంటే? పూర్తి వివరాల్లోకి వెళితే ధరమ్ వీర్ దహియా సోమవారం […] -
COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు ఇటీవల తెలంగాణలో కూడా కొన్ని రోజుల నుంచి 400కు పైగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల కరోనా వల్ల మరణాలను మాత్రం అదుపు చేయగలుగుతున్నాం. తాజాగా గడిచిన […] -
Himachal Pradesh: లోయలో పడిన బస్సు.. 12 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని జంగ్లా ప్రాంతంలోని సైంజ్ లోయలో ప్రైవేటు బస్సు పడింది. బస్సు లోయలో పడటంతో నుజ్జనుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 12 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో స్కూలు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. కులు నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలను చేపడుతున్నారు. కులు డిప్యూటీ […] -
Gyanvapi Mosque Case: నేడు వారణాసి కోర్ట్ లో జ్ఞానవాపి కేసు విచారణ
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును జూలై 4కు వాయిదా వేసింది. దీంతో […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!